Rajasthan: అవినీతి అధికారులు, అవినీతి డబ్బును దాచేందుకు ఏకంగా ప్రభుత్వ భవనాన్నే వాడకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజధాని జైపూర్ నగరంలోని యోజన భవన్‌లోని బేస్‌మెంట్‌లో తాళం వేసి ఉన్న అల్మారా నుంచి ₹ 2.31 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బేస్‌మెంట్‌లోకి తరుచుగా వెళ్లే ఏడుగురు ప్రభుత్వ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.