Uttarakhand HC: భార్యతో బలవంతంగా అసహజ శృంగారానికి పాల్పడిన భర్తను శిక్షించొచ్చా..? హైకోర్టు ఏం చెప్పిందంటే..
- భార్యతో బలవంతంగా అసహజ శృంగారానికి పాల్పడిన భర్తను శిక్షించొచ్చా..?
- ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand HC: సెక్షన్ 375 ప్రకారం వైవాహిక అత్యాచారాన్ని నేరం కాదని, ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం భార్యతో అసహజ శృంగారం చేసినందుకు భర్తను దోషిగా నిర్ధారించలేమని ఉత్తరాఖండ్ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. హైకోర్టు ఐపీసీ సెక్షన్ 375(రేప్), సెక్షన్ 377 నిబంధనల్ని వివరించింది. సెక్షన్ 375 (ఇది అత్యాచారాన్ని నిర్వచిస్తుంది) కింద భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం, పెళ్లయిన జంటలకు మినహాయింపు(2) కింద శిక్షార్హమైనది కాదు అని చెప్పింది. నవతేజ్ సింగ్ జోహార్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించింది. నవతేజ్ జోహార్ తీర్పులో పెద్దల మధ్య అసహజ సెక్స్‌ని నేరంగా పరిగణించని కారణంగా, భారతీయ చట్టాలలో లైంగిక సంబంధాలకు వివాహాన్ని సమ్మతిగా భావించినందున, భార్యతో అసహజ శృంగారం చేసిన భర్తపై అభియోగాలు విధించరాదని హైకోర్టు పేర్కొంది.
ఐపీసీ సెక్షన్ 375 మినహాయింపు(2) ప్రకారం ‘‘ఒక పురుషుడు తన సొంత భార్యతో లైంగిక సంబంధం లేదా లైంగిక చర్యలు అత్యాచారం కాదు’’ అని పేర్కొంది. వివాహ సమయంలో అసహజ సెక్స్‌కి భార్య అనుమతి తెలియజేయలేదని ఆమె తరుపు న్యాయవాది కోర్టులో వాదించారు. సెక్షన్ 377 ఐపీసీ అనేది బలవంతపు అసహజ సెక్స్‌కి శిక్షలు విధించే చట్టమని, ఇందులో భర్తకు అనుకూలంగా ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని వాదించారు. హిందూ వివాహ చట్టం-1955 లోని సెక్షన్ 13(2)(ii) ప్రకారం అసహజ సెక్స్ విడాకులకు కారణమని న్యాయవాది వాదించాడు.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్‌సభలో కాంగ్రెస్‌తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
Read Also: Godavari Floods: గోదావరికి శబరిపోటు.. ప్రమాద హెచ్చరికలు జారీ
‘‘ పై సెక్షన్ అనేది భార్యభర్తల మధ్య అసహజ శృంగారం జరిగినప్పుడు వర్తించదు. బాధితురాలు భర్తకు భార్య కానప్పుడు ఈ సెక్షన్ 13 (2) (ii) హిందూ వివాహ చట్టం, 1955 ఖచ్చితంగా అమలులోకి వస్తుంది. భార్యభర్తల మధ్య ఒక చర్య సెక్షన్ 375 ఐపీసీ 2 ప్రకారం మినహాయింపు ఉంటుంది కాబట్టి, ఆ చర్య ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం నేరం కాదు.’’ అని హైకోర్టు పేర్కొంది.
భర్త తనపై బలవంతంగా అసహజ శృంగారానికి పాల్పడ్డాడని భార్య ఆరోపించింది. ఇలాంటి పరిస్థితుల్లో భర్తపై సెక్షన్ 377ఐపీసీ యొక్క నిబంధనలు అమలు చేయడం సాధ్యం కాదు అని కోర్టు అభిప్రాయపడింది. బలవంతంగా అసహజ శృంగారానికి లొంగకపోయేసరికి, బలవంతం చేయడానికి కొడుకుకి తన ల్యాప్‌టాప్‌లో అసభ్యకరమైన కంటెంట్ చూపించాడని, అనుచితంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. పిల్లాడి ముందు బలవంతంగా శృంగారం చేశాడని చెప్పింది. దీంతో ఈ కేసులో పోక్సో చట్టం కింద నమోదైన కేసును హైకోర్టు సమర్థించింది. అసహజ సెక్స్ ఆరోపణల్ని పక్కన పెట్టింది.
తాజావార్తలు
-
Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
-
Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్.. 5,200mAh బ్యాటరీ, ధర రూ. 10,000 లోపే..!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!