Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Can A Tenant Become Owner After 12 Years Know Indian Property Law Rules

Tenant Ownership after 12 Years: అద్దె చెల్లించేవారే 12 ఏళ్ల తర్వాత యజమాని అయిపోతారా..? చట్టం ఏం చెబుతుంది..?

Published Date :April 13, 2026 , 2:24 pm
By Sudhakar Ravula
Tenant Ownership after 12 Years: అద్దె చెల్లించేవారే 12 ఏళ్ల తర్వాత యజమాని అయిపోతారా..? చట్టం ఏం చెబుతుంది..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tenant Ownership after 12 Years: చాలా కాలంగా ఒక ఇంట్లో అద్దెకు లేదా భూమిని కౌలుకు తీసుకుంటున్నవారు 12 సంవత్సరాల తర్వాత ఆ ఆస్తికి యజమానులు అయిపోతారనే ప్రచారం తరచూ వినిపిస్తుంది. “12 ఏళ్లు ఉంటే ఇల్లు మీదే అయిపోతుంది” అనే మాట చాలా మందిలో ఉంది. అయితే, నిజంగా చట్టం అలా చెబుతుందా? ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

అద్దెదారు యజమాని అవుతారా?
సాధారణంగా ఒక అద్దెదారు కేవలం చాలా సంవత్సరాలు అక్కడ నివసించాడనే కారణంతో ఆ ఇంటి లేదా భూమి యజమాని కాలేడు. అద్దె ఒప్పందం ద్వారా ఆస్తిలో ఉండే హక్కు మాత్రమే ఉంటుంది. యాజమాన్య హక్కు మాత్రం ఇంటి యజమానిదే. అంటే, అద్దె చెల్లిస్తూ ఒక ఇంట్లో 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువకాలం ఉన్నా, ఆటోమేటిక్‌గా ఆస్తి మీద హక్కు రాదు అనిది స్పష్టం అన్నమాట..

12 ఏళ్ల నిబంధన ఏమిటి?
ఇక్కడ “అడ్వర్స్ పొజెషన్” (Adverse Possession) అనే చట్టపరమైన భావన వస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఒక వ్యక్తి చాలా సంవత్సరాలు నిరంతరంగా, బహిరంగంగా, యజమాని అభ్యంతరం లేకుండా ఆస్తిని తన ఆధీనంలో ఉంచుకుంటే, యాజమాన్యంపై కోర్టులో హక్కు కోరే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ ఆస్తుల విషయంలో సాధారణంగా 12 సంవత్సరాల కాలపరిమితి ప్రస్తావనలోకి వస్తుంది.

ఎలాంటి పరిస్థితుల్లో ఇది వర్తిస్తుంది?
అసలు యజమాని చాలా సంవత్సరాలు ఆస్తిపై హక్కు వినియోగించకపోవడం.. ఆస్తిని వేరొకరు నిరంతరంగా తమ ఆధీనంలో ఉంచుకోవడం.. ఆ ఆక్రమణ బహిరంగంగా ఉండడం.. యజమాని దీనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకపోవడం.. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే కోర్టులో అడ్వర్స్ పొజెషన్ ఆధారంగా కేసు వేయవచ్చు.

అద్దెదారులకు ఇది వర్తిస్తుందా?
నిపుణుల ప్రకారం, అద్దెదారుల విషయంలో ఇది అంత సులభం కాదు. ఎందుకంటే వారు మొదట ఆస్తిలోకి ప్రవేశించింది యజమాని అనుమతితోనే. కాబట్టి అద్దెదారు ఉన్నంత మాత్రాన అడ్వర్స్ పొజెషన్ క్లెయిమ్ చేయడం కష్టం. అద్దె సంబంధం ముగిసిన తర్వాత, యజమాని హక్కును బహిరంగంగా తిరస్కరిస్తూ చాలా కాలం కొనసాగితేనే కొన్ని ప్రత్యేక కేసుల్లో పరిశీలనకు వస్తుంది.

చట్టపరంగా జాగ్రత్తలు అవసరం
ఈ అంశం ప్రతి కేసులో ఒకేలా ఉండదు. పత్రాలు, ఒప్పందాలు, అద్దె చెల్లింపుల రికార్డులు, యజమాని చర్యలు వంటి అనేక అంశాలపై నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇలాంటి విషయాల్లో న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మొత్తంగా కేవలం 12 సంవత్సరాలు అద్దెకు ఉన్నారని ఎవ్వరూ యజమాని అయిపోరు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అడ్వర్స్ పొజెషన్ చట్టం వర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి “12 ఏళ్లు ఉంటే ఇల్లు మీదే” అనే ప్రచారం పూర్తిగా నిజం కాదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 12 years property claim India
  • adverse possession India
  • can tenant become owner
  • Indian property law
  • landlord tenant rules

తాజావార్తలు

  • Tenant Ownership after 12 Years: అద్దె చెల్లించేవారే 12 ఏళ్ల తర్వాత యజమాని అయిపోతారా..? చట్టం ఏం చెబుతుంది..?

  • Nani: నాని డేట్స్ కోసం దర్శకుల పోరాటం.. ఆ లుక్ మారే వరకు ‘రోమియో’ రానట్టే!

  • Revanth Reddy-PM Modi: జాతీయ ప్రయోజనాలే ముఖ్యం.. ప్రధాని మోడీకి సీఎం రేవంత్‌ లేఖ!

  • Minister Seethakka: కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్.. 48 గంటల్లో క్షమాపణలు చెప్పాలంటూ హెచ్చరిక!

  • Uday Kiran Organ Donation: ఆ యువకుడి ముందు చావు కూడా చిన్నబోయింది.. 8 మందికి పునర్జన్మనిచ్చిన 22 ఏళ్ల యువకుడు!

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions