తీవ్ర సంక్షోభంలో వున్న శ్రీలంకలో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్రరూపు దాల్చింది. ధరలు ఆకాశాన్నంటుతుండడం, నిత్యావసరాల కొరత, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో లంకేయులు అల్లాడిపోతున్నారు. దీంతో దేశంలో అరాచక పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలంక ప్రభుత్వం 36 గంటల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. దీనికి తోడు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల అస్థిరత రాజ్యమేలుతుండడంతో ఈ కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం…
కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు బడ్జెట్-2022ను ఆవిష్కరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ప్రకారం కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. కొన్నింటిపై కస్టమ్ సుంకం తగ్గించగా.. కొన్నింటిపై కస్టమ్ సుంకం పెంచారు. అందువల్ల ధరల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ధరలు తగ్గే వస్తువుల జాబితా: మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ట్రాన్స్‌ఫార్మర్లు, వజ్రాలు,…
పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా జనం పెద్ద ఎత్తున రోడ్లెక్కి నిరసనకు దిగుతుండడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. తన విధానాలతో దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ఇమ్రాన్ వెంటనే గద్దె దిగాలని ఆందోళన కారులు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్‌తో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజలు వేలాది మంది కరాచీలో రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని…