UP: తాళి కట్టే సమయంలో వధువు షాక్.. నిర్ఘాంతపోయిన పండితులు.. బంధువులు
- తాళి కట్టే సమయంలో వధువు షాక్
- స్టేజ్‌పై పెళ్లి నిరాకరించిన వధువు
- నిర్ఘాంతపోయిన పండితులు.. బంధువులు
- ఉత్తరప్రదేశ్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి.. జీవితంలో అత్యంత వైభవంగా జరుపుకునే వేడుక. పేదోడైనా.. సామాన్యుడైనా.. ధనవంతుడైనా తమ స్థాయికి తగ్గట్టుగా గ్రాండ్‌గా వివాహాలు జరిపిస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా అలాగే అత్యంత వైభవంగా పెళ్లి వేడుక జరుగుతోంది. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో సందడి సందడిగా మండపం కళకళలాడుతోంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆచారాలు జరుగుతున్నాయి. వధువరూలిద్దరూ కూడా దండలు కూడా మార్చుకున్నారు. స్టేజ్‌పై చక్కగా నడిచారు కూడా. ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు.. తాళి కట్టే సమయంలో ఒక్కసారిగా వధువు షాకిచ్చింది. పెళ్లి చేసుకోనని మొండికేసింది. దీంతో అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: EC-West bengal: ఎన్నికల వేళ ఈసీ కొరడా.. బెంగాల్లో ఏడుగురు ఎన్నికల అధికారులు తొలగింపు
Also Read
- Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
- Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
- E20 Ethanol Demand: E20 తర్వాత అసలు సవాలు ఏంటి?.. ఆహారం, నీటిపై ఒత్తిడి తప్పదా?
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా పశ్చిమషరీర పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో గ్రాండ్‌గా వివాహ వేడుకలు జరుగుతున్నాయి. బంధువులు, గ్రామస్తులంతా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రయాగ్‌రాజ్‌లోని కథుల నుంచి వరుడు భారీ ఊరేగింపుతో మండపానికి వచ్చాడు. వధువు కూడా భారీ ఊరేగింపుతోనే మండపానికి చేరుకుంది. ఇంటి వెలుపల లైటింగ్, డీజే సౌండ్లు, నృత్యాలు అబ్బో.. సందడి మామూలుగా లేదు. ఇక స్టేజ్‌పైకి పిలవగానే వధూవరులు దండలు కూడా మార్చుకున్నారు. చప్పట్లు, కేరింతలతో సందడిగా సాగుతోంది. ఇక తాళి కట్టడమే ఆలస్యం. ఇంతలోనే వధువు బాంబ్ పేల్చింది. ఈ పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ప్రకటించింది. అంతే అందరూ నోరెళ్లబెట్టారు. అమ్మాయి మాటలకు అంతా షాక్‌కు గురయ్యారు.
ఇది కూడా చదవండి: India vs Pakistan History: ఫిబ్రవరి 15.. అదే తేదీ, అదే చరిత్ర! మళ్లీ టీమిండియాకు టైటిల్‌పై భయం?
వేదికపై నిశ్శబ్దం అలుముకుంది. వరుడి కుటుంబం అయితే అవాక్కైంది. దీంతో ఇరువైపుల బంధువులు, గ్రామ పెద్దలు రంగంలోకి దిగి అర్ధరాత్రి వరకు పంచాయితీ నిర్వహించారు. అమ్మాయిను ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పెళ్లి చేసుకునేందుకు ససేమిరా అంది. రక్తసంబంధికులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. ఇక చేసేదేమీలేక ఇరువర్గాలు పరస్పరం వేడుకను రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి గొడవలు, గందరగోళం లేకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
అయితే వధువు అప్పటికే మరొక వ్యక్తితో సంబంధం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని చెప్పుకొంటున్నారు. అయితే ఈ వాదనలను అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. ఇక ఈ ఘటనపై ఇరు పక్షాల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.
- Tags
- Bride refuses
- groom
- Jaimala
- married
- UP
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!