Rajasthan: మృత్యుంజయుడు.. బోరుబావిలో పడిన 9 ఏళ్ల బాలుడిని రక్షించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: బోరుబావి ప్రమాదాలు మనం చాలా సార్లు చూశాం. బోరుబావిలో పడిపోయిన చిన్నారుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వారే ఉన్నారు. అధికారులు ఎన్ని రోజులు ప్రయత్నించినా చివరకు వారి మృతదేహాలు మాత్రమే బయటకు వచ్చేవి. కానీ రాజస్థాన్ లో ఓ 9 ఏళ్ల పిల్లాడు బోరుబావి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన రాజస్థార్ లోని జైపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
Read Also: Naga Chaitanya: మా తాత.. ఎన్టీఆర్ గురించి ఇంట్లో అలా చెప్పేవారు
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
పూర్ జిల్లాలోని శనివారం ఉదయం బోరుబావిలో పడిపోయిన తొమ్మిదేళ్ల బాలుడిని ఏడు గంటల పాటు శ్రమించి రక్షించారు. బాలుడు అక్షిత్ ఆడుకుంటూ తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయాడు. బోరుబావిపై ఉన్న రాయిని ఇతర పిల్లలు తొలగించడంతో అది చూడకుండా అక్షిత్ అందులో పడిపోయాడు. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన భోజ్‌పురా గ్రామంలో చోటుచేసుకుంది. బాలుడు 200 ఫీట్ల బోరుబావిలో చిక్కుకున్నాడు. దాదాపుగా 7 గంటలు కష్టపడిన తర్వాత బాలుడ్ని విజయవంతంగా రెస్క్యూ చేశారు. బాలుడి పరిస్థితి నిలకడ ఉన్నట్లు, ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
అక్షిత్ బోరుబావిలో పడిన ఘటన అధికారులకు చేరడంతోనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్), ఎస్డీఆర్ఎఫ్, రాజస్థాన్ పోలీస్ బృందాలు రెస్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. రెస్క్యూ సమయంలో బోరులోకి పిల్లాడికి ఆక్సిజన్, నీరు, తినడానికి బిస్కెట్ల సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. ఇనుప వలను బోరు బావిలోకి పంపిన అధికారులు, దానికి అక్షిత్ చిక్కుకునేలా చేసి పైకి తీసుకురాగలిగారు. రాష్ట్రవ్యవసాయం మంత్రి లాల్ చంద్ కటారియా సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ను దగ్గరుండి పర్యవేక్షించారు.
తాజావార్తలు
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..