Akali Dal: అకాలీదళ్‌కి బూస్ట్.. సిక్కు ప్యానెల్ ఎన్నికల్లో విజయం..
- పంజాబ్‌లో కీలక రాజకీయ పరిణామం..
- రోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ ఎన్నికల్లో అకాలీదల్ గెలుపు..
- వరస ఓటముల మధ్య ఓదార్పు విజయం.. అకాలీదళ్‌కి బూస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akali Dal: పంజాబ్‌లో వరస ఓటములతో ఢీలా పడిన శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ)కి ఊరట విజయం దక్కింది. ఈ పార్టీకి చెందిన అభ్యర్థి హర్జిందర్ సింగ్ ధామీ సిక్కుల అత్యున్నత సంస్థ అయిన శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(SGPC) అధ్యక్షుడిగా వరుసగా నాలుగోసారి తిరిగి ఎన్నికయ్యారు. ఈ గెలుపు పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌కి కొత్త ఊపుని ఇచ్చింది. సోమవారం జరిగిన ఎన్నికల్లో ధామి విజయం సాధించారు. అంతకుముందు రోజు తేజాసింగ్ సముందరి హాల్లో జరిగిన ఎన్నికల్లో SGPC మాజీ అధ్యక్షురాలు, అకాలీదళ్ తిరుగుబాటు వర్గానికి చెందిన అభ్యర్థి బీబీ జాగీర్ కౌర్ ధమీపై విజయం సాధించారు.
Read Also: Union Bank Recruitment : డిగ్రీ అర్హతతో రూ. 85 వేల శాలరీ.. ఎలా అప్లై చేయాలంటే..
Also Read
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్‌లు
ఈ ఎన్నికల్లో 142 మంది SGPC సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధామి 107 ఓట్లతో గెలుపొందగా, జాగీర్ కౌర్‌కి 33 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇటీవల కాలంలో అకాలీదళ్ అంతర్గత విభేదాల కారణంగా కొందరు సీనియర్ నాయకుడు ఆ పార్టీ నుంచి విడిపోయి రెబల్ గ్రూపుగా ఏర్పడ్డారు.
పంజాబ్ రాజకీయాల్లో ఒకప్పుడు ఆధిపత్య శక్తిగా ఉన్న అకాలీదళ్ ఇప్పుడు క్షీణించింది. 2007 నుంచి 2017 వరకు అధికారంలో పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఈ పార్టీ, 2017 ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో పంజాబ్‌లో కేవలం 15 స్థానాలను మాత్రమే గెలిచింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సుఖ్బీర్ సింగ్ బాదల్ నాయకత్వంలోని ఈ పార్టీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలిచింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సిక్ ప్యానెల్ ఎన్నికల్లో అకాలీదళ్ విజయం సాధించడం, ఆ పార్టీ నేతలకు ఊరట కలిగింది.
తాజావార్తలు
-
Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
-
India T20 Captaincy: సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
-
Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!