Akali Dal: పంజాబ్‌లో వరస ఓటములతో ఢీలా పడిన శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ)కి ఊరట విజయం దక్కింది. ఈ పార్టీకి చెందిన అభ్యర్థి హర్జిందర్ సింగ్ ధామీ సిక్కుల అత్యున్నత సంస్థ అయిన శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(SGPC) అధ్యక్షుడిగా వరుసగా నాలుగోసారి తిరిగి ఎన్నికయ్యారు.