Mumbai: ఫెర్రీని ఢీకొట్టిన స్పీడ్‌బోటు.. ఇద్దరు మృతి.. పలువురు గల్లంతు
- ముంబై తీరంలో ఘోర ప్రమాదం
- ఫెర్రీని ఢీకొట్టిన స్పీడ్‌బోటు
- ఇద్దరు మృతి.. పలువురు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బోటులో విహరిస్తూ ఆహ్లాదకరంగా గడుపుతున్న పర్యాటకులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓ స్పీడుబోటు అమాంతంగా వచ్చి ఢీకొట్టడంతో ఫెర్రీ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఆనందం కాస్త విషాదంగా మారడంతో టూరిస్టులు షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన నేవీ గార్డ్సు, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. మొత్తం బోటులో 80 మంది పర్యాటకులు పర్యటిస్తున్నారు. పలువురిని ప్రయాణికులను రక్షించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు.
ముంబైలోని ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి ఎలిఫెంటా గుహలకు ఫెర్రీ బోటు ప్రయాణికులతో వెళ్తోంది. అయితే అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఓ స్పీడ్‌బోటు ఢీకొట్టింది. దీంతో ఫెర్రీ మునగడం ప్రారంభించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. మరికొందరు ప్రాణభయంతో బెంబేలెత్తిపోయారు. మరికొందరు షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. పోర్టు అధికారులు, కోస్ట్‌గార్డ్, మత్స్యకారుల సహాయంతో వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఫెర్రీలో దాదాపు సిబ్బందితో పాటు 85 మంది ప్రయాణికులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే స్పీడ్‌బోటు వేగంగా ఢీకొట్టిన దృశ్యాలు.. మొబైల్లో రికార్డ్ అయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియలో వైరల్అవుతున్నాయి.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
ఇదిలా ఉంటే ఫెర్రీ బోల్తా పడే సమయంలో లైఫ్ జాకెట్లు ధరించి ఉన్నారు. అయితే కొందరు ప్రయాణికులు ప్రాణభయంతో బెంబేలెత్తిపోయినట్లుగా కనిపిస్తోంది. స్పీడ్‌బోటు ఢీకొట్టగానే సెకన్లలోనే ఫెర్రీ మునిగిపోయింది. ఒక వైపు ఒరిగిపోయింది. ఈ గందరగోళంలో కొందరు మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావల్సి ఉంది.
Shocking Video: लाइव वीडियो: मुंबई में इंडिया गेट के पास की घटना
एक स्पीडबोट ने तेज गति से दूसरी नाव को टक्कर मार दी
नाव पर 60 यात्री सवार थे।#MUMBAI #BOAT pic.twitter.com/juabBdwgWa
— Jaimin Vanol (@VanolJaimin99) December 18, 2024
A boat ferrying passengers near Elephanta has capsized. Mumbai Police and the Indian Navy are conducting rescue operations. Further details are awaited. pic.twitter.com/TzHPpL7Fnp
— Richa Pinto (@richapintoi) December 18, 2024
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!