Mumbia: ముంబైలో కోవిడ్ కలకలం..! ఇద్దరి మృతిపై భయాందోళనలు
- ముంబైలో కోవిడ్ కలకలం..!
- ఇద్దరి మృతిపై భయాందోళనలు
- బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ క్లారిటీ
ముంబైలో కోవిడ్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సోమవారం పౌరులకు విజ్ఞప్తి చేసింది. అయితే సింధుదుర్గ్, డోంబివ్లికి చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం ముంబై నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వీరిద్దరు కోవిడ్ కారణంగా చనిపోయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్, తూర్పు ఆసియా మరియు ఇతర దేశాల్లో కోవిడ్-19 కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళలు కూడా కరోనా కారణంగానే చనిపోయినట్లు ప్రచారం జరగడంపై బీఎంసీ స్పందించింది. ఇద్దరు మహిళలు కోవిడ్ కారణంగా చనిపోలేదని.. హైపోకాల్సెమిక్ మూర్ఛలతో నెఫ్రోటిక్ సిండ్రోమ్, క్యాన్సర్ కారణంగా మరణించారని పేర్కొంది. దయచేసి ప్రజలు భయపడొద్దని కోరింది. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: UK Professor: భారత వ్యతిరేక కార్యకలాపాలతో విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
కోవిడ్-19 వ్యాప్తిని అదుపులో ఉంచడానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం నిరంతరం పర్యవేక్షిస్తోందని అధికారులు తెలిపారు. జనవరి 2025 నుంచి ఏప్రిల్ 2025 వరకు కోవిడ్-19 రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపింది. మే నుంచి కొంతమంది రోగులు కనిపించారని.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన ఈ విషయంలో భయపడవద్దని పౌరులకు విజ్ఞప్తి చేసింది. సెవెన్ హిల్స్ హాస్పిటల్‌లో 20 పడకలు (MICU), పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు 20 పడకలు మరియు 60 సాధారణ పడకలు ఉన్నాయని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Vizag Deputy Mayor: ఎట్టకేలకు విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం..
సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోవిడ్-19 ను నివారించవచ్చని బీఎంసీ తెలిపింది. ముఖ్యంగా క్యాన్సర్, వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు మరియు కాలేయ వ్యాధి వంటి తీవ్రమైన అనారోగ్యాలు మరియు తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న రోగులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. జ్వరం, దగ్గు (పొడి లేదా కఫంతో), గొంతు నొప్పి, అలసట, శరీర నొప్పులు మరియు తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే మున్సిపల్ క్లినిక్, ఆసుపత్రి లేదా కుటుంబ వైద్యుడిని సంప్రదించాలని BMC పౌరులను కోరింది. లక్షణాలు కనిపిస్తే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని, ఇతరుల నుంచి దూరం పాటించాలని, సబ్బు మరియు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలని, సరైన ఆహారం పాటించాలని మరియు విశ్రాంతి తీసుకోవాలని పౌరులకు విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?