మరోసారి కేంద్రం వర్సెస్ తెలంగాణగా మారింది పరిస్థితి.. రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులతో కేంద్ర ఆర్థిక శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.. ఈ సమావేశంలో ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి అదనంగా కార్పొరేషన్ల ద్వారా రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయని వాటిని కూడా రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని పేర్కొన్న కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి.. అయితే, దీనిపై తెలంగాణ ఆర్థికశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది..
Read Also: Sri Lanka crisis: శ్రీలంక టెన్షన్ టెన్షన్.. ప్రధాని, మంత్రులు, ఎంపీల ఇళ్లకు నిప్పు
2022 – 23 ఆర్థిక సంవత్సరానికి అప్పులు తీసుకోవడానికి తెలంగాణకు అనుమతి ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు.. తెలంగాణ పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు.. కేంద్రం ఏవిధంగానైతే అప్పులు తీసుకుంటుందో.. ఆ నిబంధనలు తెలంగాణ కూడా పాటిస్తుందని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ అప్పులు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కేంద్రం మూల ధన వ్యయం కోసం… 2020-21లో రూ.12 వేల కోట్ల రుణం ఇచ్చింది, 2022-23లో లక్ష కోట్ల రుణాలు ఇచ్చింది, ఇవన్నీ మూలధన వ్యయం కోసం ఖర్చు చేసినవి కాబట్టి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రావని వాదించారు.. కొన్ని ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి చూపడం… మరికొన్నింటిని చూపకపోవటం వివక్ష అవుతుందని.. 2022-23 ఏడాదిలో రుణాల సమీకరణకు ఇంకా అనుమతి ఇవ్వలేదని ఆవేదిన వ్యక్తం చేశారు.