ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు.. మరోవైపు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. దీంతో జనాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. ముఖ్యంగా టమోటాల ధరలు మాత్రం రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి.. ప్రస్తుతం మార్కెట్ లో టమాటాలకు రేట్లు చుక్కలను చూపిస్తున్నాయి. ఇప్పటికే టమాటాలను పండిస్తున్న రైతులు కోటీశ్వరులౌతున్నారు. దీంతో ప్రభుత్వాలు కొన్ని చోట్ల సబ్సీటీ కింద టమాటాలను విక్రయిస్తున్నారు.. అది కూడా 70 రూపాయలు ఉంటుంది.. వీటికి బదులుగా ఎక్కువగా చింత పండును వాడుతున్నారు..
గత కొద్ది రోజులుగా టమోటాల ధరలు బంగారంతో పోటి పడుతున్నాయి.. ఒకప్పుడు టమాటాలను కేవలం పది రూపాయల లోపే మనం కొనుగోలు చేసే వాళ్లం. కానీ ప్రస్తుతం టమాటాల రేట్లు ఒక్కసారిగా పెరగటంతో రైతులు విపరీతంగా లాభాలు గడిస్తున్నారు. దీంతో టమాటాలు ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచాయి.. టమాటాలను పండించే రైతులు ఒకప్పుడు చాలా తక్కువ లాభాలు గడించేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం టమాటా పొలానికి సీసీ కెమెరాలు, సెక్యురిటీలను కాపాలగా పెట్టుకుంటున్నారు. దీంతో టమాటా కేవలం తప్పని సరిగా అవసరంఅనుకున్నవారు మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు..
ఇప్పుడు వెలుగులోకి నల్ల టమోటాలు వచ్చాయి.. వాటికి డిమాండ్ కూడా పెరుగుతుంది.. ఈ టమోటాలు బీహర్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ , మధ్య ప్రదేశ్ ప్రాంతాలలో ఎక్కువగా లభిస్తాయి. ఎరుపు , ఊదారంగు విత్తనాలు సేకరించి ఆతర్వాత.. ఇలా నలుపు రంగు టమాటా లు పండుతాయి.. అయితే.. ఈ నలుపు రంగు టమాటాలో పుష్కలమైన ఆరోగ్యానికి మేలు చేసే అంశాలున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఇవి ప్రత్యేక పరిస్థితిలో మాత్రమే పెరుగుతాయి. ఇవి కూడా ఎరుపు రంగు టమాటాల మాదిరిగానే ఉంటాయి. అదే విధంగా క్యాన్సర్ ను రాకుండా చేస్తాయి.. మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఇక మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా భారీగానే ఉందని తెలుస్తుంది.. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు..