తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. 221 కైవసం చేసుకొని రికార్డ్ సాధించింది. నందిగ్రామ్ లో మమత బెనర్జీ ఓటమిపాలైనప్పటికీ తృణమూల్ విజయం సాధించింది. అయితే, బెంగాల్ లోని సల్తోరా నియోజక వర్గంపై ఇప్పడు అందరి దృష్టి పడింది. ఆ నియోజక వర్గంలో రోజువారీ పనులు చేసుకొని జీవనం సాగించే దినసరి కూలి చందనా బౌరి బీజేపీ నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. తనదైన శైలిలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించిన చందనా బౌరి తృణమూల్ అభ్యర్థిపై 4 వేల మెజారిటీతో విజయం సాధించింది. గత రెండుసార్లు తృణమూల్ పార్టీనే సల్తోరా నియోజకవర్గంలో విజయం సాధించింది. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని అసలు అనుకోలేదని, అనుకోకుండా అవకాశం వచ్చిందని, తనను నియోజకవర్గ ప్రజలు గెలిపించినందుకు సంతోషంగా ఉందని, తప్పకుండా నియోజకవర్గానికి సేవ చేస్తానని చెప్పారు. బెంగాల్ కోటను బద్దలు కొట్టిన సామాన్యురాలు అంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.