బీహార్‌లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైయింది. రెండు విడతలు జరిగిన ఓటింగ్‌లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. తొలి విడతలో 65.08 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడతలో రికార్డ్ స్థాయిలో 67.14 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: భూటాన్‌లో ‘కాలచక్ర అభిషేక’ను ప్రారంభించిన మోడీ
ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మరోసారి అన్ని సర్వేలు బీజేపీ-జేడీయూ కూటమికే ప్రజలు పట్టం కట్టినట్లు తేల్చాయి. భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి గెలవబోతుందని సర్వేలు అంచనాలు వేశాయి. దీంతో కూటమి నేతల్లో.. కార్యకర్తల్లో సరికొత్త జోష్ నెలకొంది. మరోసారి అధికారంలోకి రాబోతున్నామంటూ బీజేపీ కార్యకర్తలు ఆనందంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే బీజేపీ కార్యకర్తలు లడ్డూలు సిద్ధం చేసుకుంటున్నారు. పాట్నాలో 501 కిలోల లడ్డూలను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్‌పై కీలక విషయాలు.. దర్యాప్తులో కొత్త మిస్టరీ!
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు విడతలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తొలి విడత నవంబర్ 6న జరగగా.. రెండో విడత నవంబర్ 11న జరిగింది. ఎన్నికల ఫలితాలు శుక్రవారం (14-11-2025) విడుదల కానున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉండగా.. ఎన్డీఏ కూటమి మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే రంగంలోకి దిగింది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏకు అనుకూలంగా ఉండడంతో ఆ పార్టీ నేతలు జోష్‌లో ఉన్నారు.
#WATCH | #BiharElections2025 | Ahead of the counting of votes on 14th November, BJP workers in Patna come together to prepare laddoos. They say that they are preparing 501 kg of laddoos. pic.twitter.com/mwmIpBGVsc
— ANI (@ANI) November 12, 2025