Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bjp Vs Congress In Karnataka After Waqf Board Claims 1500 Acres Of Villagers Land

Waqf Board: రైతుల భూమి వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్.. కర్ణాటకలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..

Published Date :October 26, 2024 , 8:35 pm
By BV Reddy
  • 1500 ఎకరాల రైతుల భూమి మాదే..
  • కర్ణాటకలో సంచలనంగా వక్ఫ్ బోర్డు క్లెయిమ్..
  • బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా వివాదం..
Waqf Board: రైతుల భూమి వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్.. కర్ణాటకలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Waqf Board: కర్ణాటకలో వక్ఫ్ బోర్డు తీరు వివాదాస్పదంగా మారింది. విజయపుర జిల్లాలోని రైతుల భూమి తమదే అని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేయడంతో బీజేపీ, అధికార కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. హోన్వాడ గ్రామంలోని రైతులకు మాట్లాడుతూ.. తమ పూర్వీకులు భూమిలో 1500 ఎకరాలను వక్ఫ్ బోర్డుకు రీ అసైన్డ్ చేస్తున్నట్లు అక్టోబర్ 04న తహసీల్దార్ నుంచి లేఖ అందినట్లు తెలిపారు. హొన్వాడ గ్రామంలోని రైతుల భూములను వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా 15 రోజుల్లోగా నమోదు చేయాలని కర్ణాటక వక్ఫ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఆదేశించినట్లు బీజేపీ ఆరోపించింది. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ.. రైతులకు చెందిన భూమిని తీసుకోబోమని తేల్చి చెప్పింది.

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య శుక్రవారం హోన్వాడ గ్రామంలోని రైతులను కలుసుకున్నారు. ఈ భూమి వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడానికి ముందు ఎలాంటి ఆధారాలు లేదా వివరాలు ఇవ్వకుండా రైతులకు నోటీసులు అందించారని అన్నారు. ఇటీవల నెలల్లో విజయపుర జిల్లాకు చెందిన రైతుల భూమిని వక్ఫ్ భూమిగా ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని తేజస్వీ అన్నారు. వక్ఫ్ బోర్డు సంస్కరణలపై ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్రం వక్ఫ్ చట్టాన్ని తీసుకువస్తుందని భావించిన జమీర్ అహ్మద్ ఖాన్, 15 రోజుల్లో భూమిని వక్ఫ్ ప్రాపర్టీగా నమోదు చేయాలని డిప్యూటీ కమీషనర్, రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు ఆయన ఆరోపించారు.

Read Also: Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

వక్ఫ్ చట్టంలోని ప్రస్తుత నిబంధనల వల్ల మెజారిటీ పేద ముస్లింలు కూడా ఇబ్బంది పడుతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి అన్నారు. విజయపురలో ఏం జరిగినా ఒప్పుకోం, కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో ఇలాగే జరుగుతోందని, జమీర్ అహ్మద్ ఖాన్‌కి రైతుల గురించి పట్టింపు లేదు, ఓట్ల కోసం ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని బీజేపీ విజయపుర ఎమ్మెల్య బసనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు. రైతుల తరుపున హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామని చెప్పారు.

అయితే, వక్ఫ్ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ భూమి వక్ఫ్ ప్రాపర్టీ కాబట్టి నోటీసులు జారీ చేశామని చెప్పారు. “అది వక్ఫ్ ఆస్తి అయితే అప్పుడు మాత్రమే నోటీసు ఇస్తాం.. అనవసరంగా ఎందుకు నోటీసు ఇస్తాం.. అది రైతులైనా, ప్రభుత్వమైనా, ఎవరైనా సరే.. నోటీసులు ఇస్తాం.. అది వక్ఫ్ ఆస్తి కాబట్టి మేం క్లెయిమ్ చేసుకోవాలి.. వాళ్లను అనుమతించండి. (రైతులు) చట్టబద్ధంగా పోరాడండి” అని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మరో మంత్రి ఎంబి పాటిల్ గ్రామంలోని రైతులతో సమావేశమయ్యారు. సంబంధిత పత్రాలు ఉంటే భూమిని తీసుకోబోమని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • karnataka
  • Waqf Board

తాజావార్తలు

  • US: అమెరికాలో షాకింగ్ ఘటన.. ట్రంప్ ఉన్నతాధికారి రాజీనామా.. యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు

  • JC Prabhakar Reddy Emotional: కన్నీరు పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి..

  • PM Vidya Lakshmi: పీఎం-విద్యా లక్ష్మి యోజన అంటే ఏమిటి? హామీ లేకుండా రూ. 10 లక్షల రుణం ఎలా పొందాలి?

  • Akshay Kumar: గ్యాస్ సంక్షోభం వేళ అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వంటింటి గుట్టు వెల్లడి

  • India Post: తపాలా శాఖ 3 కొత్త టైమ్-బౌండ్ ప్రీమియం సేవలు ప్రారంభం.. 24 & 48 Speed Postతో ప్రైవేట్ కొరియర్లకు చెక్!

ట్రెండింగ్‌

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions