BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్..
- తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- 15 కార్పొరేషన్లు బీజేపీ వశం, మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి..
BJP: గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా, అన్నింటిని బీజేపీ సొంతం చేసుకుంది. ఈ ఫలితాలు పట్టణ ప్రాంతంలో కాషాయ పార్టీకి ఉన్న బలాన్ని మరోసారి స్పష్టం చేశాయి. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్‌లు పత్తాలేకుండా పోయాయి. నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేదు. మొత్తం 1,044 సీట్లు గల 15 మున్సిపల్ కార్పొరేషన్లలో, బీజేపీ 856 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోగా, ఇతరులు 12 స్థానాల్లో విజయం సాధించారు.
అహ్మదాబాద్, సూరత్ కార్పొరేషన్లలో బీజేపీ సంచలన విజయాలను సాధించింది. అహ్మదాబాద్‌లోని 192 స్థానాలకు గానూ బీజేపీ 158 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 22 స్థానాల్లో గెలిచింది. ఇక సూరత్‌లో 120 స్థానాలు ఉంటే, బీజేపీ 115 స్థానాల్లో, ఆప్ 4 స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్ ఒకే స్థానానికి పరిమితమైంది. గత ఎన్నికల్లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన ఆప్ ఈ సారి ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది.
Also Read
- Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్‌లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
- Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్‌లైన్స్ హెచ్చరిక..
- Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
Read Also: Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
రాజ్‌కోట్, వడోదర, భావ్‌నగర్‌లలో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. రాజ్‌కోట్‌లో 72 స్థానాలకు గానూ బీజేపీ 65, కాంగ్రెస్ 7 స్థానాలను గెలుచుకుంది. వడోదరలో 76 వార్డులకు గానూ బీజేపీ 69, కాంగ్రెస్ 6 వార్డుల్ని గెలుచుకుంది. భావ్‌నగర్‌లోని మొత్తం 52 వార్డులు ఉంటే బీజేపీ 44, కాంగ్రెస్ 8, ఆప్ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. మధ్యతరహా పట్టణాల్లో కూడా కమలం తన జోరు చూపించింది. కర్మసాద్-ఆనంద్, గాంధీ దామ్, నడియాడ్, నవసారి పట్టణాలను బీజేపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. పోర్ బందర్, మోర్బి, సురేంద్ర నగర్, మొహసానా, వాపి, జామ్‌నగర్ కార్పొరేషన్లను కూడా బీజేపీ గెలుచుకుంది.
84 మున్సిపాలిటీల్లోని 2030 వార్డులు ఉంటే బీజేపీ 1791 గెలుచుకోగా, కాంగ్రెస్ 414 స్థానాల్లో, ఇతరులు 144 స్థానాల్లో విజయం సాధించారు. 34 జిల్లా పంచాయతీల్లో 1090 స్థానాలు ఉంటే బీజేపీ 568 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 77, ఇతరులు 30 స్థానాల్లో గెలిచారు. 260 తాలూకా పంచాయతీల్లో 5234 స్థానాలు ఉంటే బీజేపీ 2397 స్థానాలను దక్కించుకుంటే, కాంగ్రెస్ 591, ఇతరులు 329 స్థానాల్లో గెలిచారు.
తాజావార్తలు
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్‌లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్‌లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో