BJP: శ్రద్ధా వాకర్ హత్యపై ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు మౌనంగా ఉంటున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Slams Uddhav Thackeray For Silence On Shraddha Case: శ్రద్ధావాకర్ హత్య రాజకీయ దుమారాన్ని రాజేసింది. ఇటీవల ఢిల్లీ శ్రద్ధా వాకర్ ను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశారు. డెడ్ బాడీని 35 ముక్కులుగా నరికేశాడు. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య అగ్గిరాజేసింది. శ్రద్ధావాకర్ హత్యపై ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది. కొత్త హిందువు అనే భావన తీసుకురావడం ద్వారా ఠాక్రే హిందువులను విభజించాలని చూస్తున్నారని ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ గురువారం ఆరోపించారు.
Read Also: Pakistan: “పుల్వామా దాడి”కి పాక్ కొత్త ఆర్మీ చీఫ్ కారణం.. భారత్ అంటే నరనరాన వ్యతిరేకతే..
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
మరాఠీ ముస్లింకు మద్దతు ఇస్తానని ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు అన్నారని ప్రశ్నించారు ఆశిష్ షెలార్. జైనులు, గుజరాతీలు, నార్త్ ఇండియన్స్ తో ఆయను ఎలాంటి సమస్యలు ఉన్నాయని ప్రశ్నించారు. కేవలం ముస్లిం ఓట్లను పొందేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ముందు ముంబైలో జరిగిన ర్యాలీలో బీజేపీ, ఉద్ధవ్ ఠాక్రేపై ప్రశ్నల వర్షం కురిపించింది.
ముంబై అమ్మాయి శ్రద్ధా వాకర్ అనే అమ్మాయిని అఫ్తాబ్ హత్య చేసి ముక్కలుగా నరికాడు. డిసెంబర్ 22, 2020న శ్రద్ధా వాకర్ మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో మహారాష్ట్రలో శివసేన, మహావికాస్ అఘాఢి ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో శ్రద్ధా తనను అఫ్తాబ్ అనే వ్యక్తి చంపేస్తానంటున్నాడని పోలీసులకు లేఖ రాసిన పట్టించుకోలేదు. అప్పటి హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని బీజేపీ ఆరోపించింది. ఇటీవల ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే, బీహార్ పర్యటనపై ఆశిష్ షెలార్ ఎగతాళి చేశాడు. లాలూ దాణా కుంభకోణం కేసులో ఎంత తిన్నాడో తెలుసుకునేందుకు ఆదిత్య ఠాక్రే, తేజస్వీ యాదవ్ ను కలిశాడంటూ విమర్శించారు. జ్ఞాన్‌వాపి సమస్యపై కోర్టు ఆదేశాలను ఉద్ధవ్ జీ కూడా స్వాగతించలేదని అన్నారు.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!