Site icon NTV Telugu

Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘డెడ్ ఎకానమీ’’ కామెంట్స్.. స్పందించిన బీజేపీ..

Rahulgandhi

Rahulgandhi

Rahul Gandhi: భారత ఆర్థిక వ్యవస్థ ‘‘డెడ్ ఎకానమీ’’ అంటూ మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన చేసిన ట్వీట్ మరోసారి వివాదాన్ని రాజేసింది. రష్యా చమురు కొనుగోలు తర్వాత, భారత్‌పై యూఎస్ 50 శాతం సుంకాలను విధించడంపై, దేశంలో వస్త్ర పరిశ్రమ కాపాడటంపై కేంద్ర ప్రభుత్వం మేల్కొనాలని ఆయన అన్నారు. ‘‘సుంకాల వల్ల ప్రభావితమైన వ్యాపారాల సమస్యలను ప్రధాని మోడీ పరిష్కరించడం లేదు. 50 శాతం సుంకాలు, భారత వస్త్ర పరిశ్రమను దారుణంగా దెబ్బతీసింది. ఉద్యోగాలు పోయాయి, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. తగ్గిన ఆర్డర్లు మన ‘‘డెడ్ ఎకానమీ’’ వాస్తవికత’’ అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Read Also: BCCI vs BCB: బంగ్లాదేశ్ పుట్టిందే భారత్ సపోర్టుతో.. బీసీసీఐ లేకుంటే బీసీబీకి ఐసీసీలో గుర్తింపు ఏది?

అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. భారతదేశానికి అసలు సమస్య డేటాతో కాదని, బేటా(కుమారుడి)తో ఉందని ఎద్దేవా చేసింది. ఆయన ఆరోపణలు భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. ‘‘ఐఎంఎఫ్ 2025 ఏడాదికి భారత వృద్ధి అంచనాలను 7.3గా పేర్కొంది. మనం 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారామని ఐఎంఎఫ్ చెప్పింది. ఈయూ భారత్ మధ్య ఒప్పందాన్ని ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’గా ప్రశంసిస్తున్నారు’’ ఆయన అన్నారు. ఆర్బీఐ డేటా బీజేపీ హయాంలో 9 కోట్ల ఉద్యోగాలు వచ్చాయని, కాంగ్రెస్ పాలనలో 2 కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పిందని అన్నారు. రాహుల్ గాంధీ ఎజెండా భారత్‌కు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు.

Exit mobile version