Rahul Gandhi: భారత ఆర్థిక వ్యవస్థ ‘‘డెడ్ ఎకానమీ’’ అంటూ మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన చేసిన ట్వీట్ మరోసారి వివాదాన్ని రాజేసింది. రష్యా చమురు కొనుగోలు తర్వాత, భారత్‌పై యూఎస్ 50 శాతం సుంకాలను విధించడంపై, దేశంలో వస్త్ర పరిశ్రమ కాపాడటంపై కేంద్ర ప్రభుత్వం మేల్కొనాలని ఆయన అన్నారు.