Lok sabha: కాంగ్రెస్ వ్యాఖ్యలపై రగడ.. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ నిరసన
- కాంగ్రెస్ వ్యాఖ్యలపై రగడ
- పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ నిరసన
- కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ చేపట్టిన ‘ఓట్ చోరీ’ బహిరంగ సభలో కాంగ్రెస్ నేతలు మోడీ ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ‘‘మోడీకి సమాధి తవ్వాలంటూ’’ నినాదాలు చేశారు. ఇదే అంశంపై సోమవారం లోక్‌సభ, రాజ్యసభలో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధాని మోడీని చంపాలనుకుంటున్నారా? అని కమలనాథులు ప్రశ్నించారు. సభలో గందరగోళం నెలకొనడంతో ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
Also Read
రాహుల్ గాంధీ..
ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటు చోరీకి పాల్పడుతున్నారని దేశంలోని ప్రతి ఒక్కరికి తెలుసు అని రాహుల్ గాంధీ అన్నారు. ఓటరు జాబితాలోని అక్రమాలపై ఈసీని అడిగితే జవాబు లేదన్నారు. ఓటు చోరీ బీజేపీ డీఎన్ఏలోనే ఉందని ఆరోపించారు. అధికారం కోల్పోగానే మోడీ నిజస్వరూపం బయటపడుతుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఆదేశాలు.. పిఠాపురంలో ప్రారంభం..
డిసెంబర్ 1న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19 వరకు జరగనున్నాయి. సమావేశాల ప్రారంభమైన దగ్గర నుంచి ఓట్ చోరీ వ్యవహారంపై రగడ జరుగుతోంది. గత వర్షాకాల సమావేశాలు కూడా ఇలానే ముగిశాయి. ఈ సమావేశాలు కూడా అలానే ముగిసేలా ఉన్నాయి.
తాజావార్తలు
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Upcoming IPOs: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్.. వచ్చే 7 రోజుల్లో లక్షల కోట్ల గోల్డెన్ ఛాన్స్! ఎలాగో తెలుసా..
-
Rahul Gandhi: అయ్యా రాహుల్ గాంధీ.. ఇటలీని చూసి నేర్చుకోండి
-
Vaibhav: అది సార్ ‘వైభవ్ సూర్యవంశీ’ అంటే.. తిట్టిన నోళ్లే జైజైలు కొట్టాయి.. ఫిదా అయిన లంక ఆటగాళ్లు..
-
Cricket Helmet History: క్రికెట్ హెల్మెట్ వెనుక ఆసక్తికర కథ.. ఎలా పుట్టిందో తెలుసా..
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!