Arvind Kejriwal: కేజ్రీవాల్ మామిడి పండ్లు తినడంపై స్పందించి ఆప్.. చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను తీహార్ జైలులో ఉన్నాడు. అయితే జైలులో కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు, ఆలూ పూరీలు తింటున్నాడని, షుగర్ వ్యాధితో బాధపడుతున్న కేజ్రీవాల్ తన షుగర్ లెవల్స్ పెంచుకుని, అనారోగ్య సమస్యలతో బెయిల్ పొందాలని చూస్తున్నారంటూ ఈడీ కోర్టులో ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ సీఎం హత్యకు జైల్లో పథకం రచిస్తు్న్నారని ఆరోపించింది. కేజ్రీవాల్‌ని చంపేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారంటూ ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు.
Read Also: Lok sabha election: ఎన్నికల వేళ బాలీవుడ్ నటుల డీప్‌ఫేక్ వీడియోలు.. లేటెస్ట్గా బుక్కైన మరో నటుడు
Also Read
‘‘ఇది మోడీ, బీజేపీ చేసిన కుట్ర, కేజ్రీవాల్‌ని చంపడానికి కుట్ర పన్నారు. జైలులో ఆయనకు ఇంటి భోజనాన్ని నిలిపివేయాలని ఈడీ, బీజేపీ భావిస్తున్నాయి. కోర్టులో అతను స్వీట్లు, టీ తాగుతున్నాడని ఈడీ ప్రస్తావించింది. ఇది పూర్తిగా అబద్ధం’’ అని అతిషి చెప్పారు. కేజ్రీవాల్ రెండు అరటి పండ్లు తినడం అనేది ఈడీ రెండో అబద్ధమని, షుగర్ పేషెంట్లు అత్యవసర పరిస్థితుల్లో చాక్లెట్లు, అరటిపండ్లు తమతో ఉంచుకోవాలని ఎప్పుడూ కోరుతారు. మూడో అబద్ధం ఆలూపూరీ తినడమని ఆమె అన్నారు. ఈడీ సమర్పించిన డైట్ చార్ట్‌లో కేజ్రీవాల్‌కి ఒక రోజు మాత్రమే పూరీ ఉందని, అది కూడా నవరాత్రి మొదటి రోజని, అతనికి మీరు నవరాత్రి ప్రసాదాన్ని అనుమతించలేదా..? అని ప్రశ్నించారు.
డయాబెటిక్‌తో బాధపడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కావాలనే జైల్లో తీపి పదార్థాలు తింటున్నారని, తద్వారా షుగర్ లెవల్స్ పెరిగి వైద్యపరమైన కారణాలతో బెయిల్ పొందాలని చూస్తున్నారని బీజేపీ నేత మజీందర్ సింగ్ సిర్సా అన్నారు. కేజ్రీవాల్ వైద్యపరమైన కారణాలతో జైలులో ‘‘చక్కెర కుంభకోణం’’లో మునిగిపోయారని ఆరోపించారు. మద్యం కుంభకోణం, ఇప్పుడ చక్కెర కుంభకోణానికి పాల్పడుతున్నాడని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!