మహారాష్ట్రలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. డియోలీ నుంచి వార్ధాకు వెళ్తున్న సమయంలో ఓ కారు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడిక్కడే మరణించారు. కారులో ఉన్న వారంతా వైద్య విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. మృతులంతా 25-35 ఏళ్లు లోపు వారే. మృతుల్లో తిరోడా ఎమ్మెల్యే విజయ్ రహంగ్‌డేల్ కుమారుడు కూడా ఉన్నాడు.
Read Also: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: ఉదయం రాజ్యసభ.. సాయంత్రం లోక్‌సభ
ఎంతో బంగారు భవిష్యత్ ఉన్న ఏడుగురు వైద్య విద్యార్థులు మరణించడంతో ఈ వార్త స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతి చెందిన ఏడుగురిలో ఒకరు బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు కాగా, మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల పరీక్షలు ముగియడంతో విద్యార్థులంతా వార్ధాకు వెళుతున్నారని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు.