Karnataka: కర్ణాటక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయిన ప్రభు చౌహాన్ కుమారుడు ప్రతీక్ చౌహాన్‌పై అత్యాచారం కేసు నమోదైంది. బీదర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళ ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు. పదేపదే అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు, దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. ఫిర్యాదు ప్రకారం, డిసెంబర్ 25, 2023లో సదరు బాధిత మహిళతో ప్రతీక్ చౌహాన్ ఎంగేజ్మెంట్ జరిగింది. నిశ్చితార్థం తరువాత పెళ్లి హామీతో పలుమార్లు మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది.
మహారాష్ట్రలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. డియోలీ నుంచి వార్ధాకు వెళ్తున్న సమయంలో ఓ కారు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడిక్కడే మరణించారు. కారులో ఉన్న వారంతా వైద్య విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. మృతులంతా 25-35 ఏళ్లు లోపు వారే. మృతుల్లో తిరోడా ఎమ్మెల్యే విజయ్ రహంగ్‌డేల్ కుమారుడు కూడా ఉన్నాడు. Read Also: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: ఉదయం రాజ్యసభ.. సాయంత్రం లోక్‌సభ…