బీజేపీ తెలంగాణ అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. జులై ఒకటిన పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన ఉంటుంది. నెలల తరబడి పేరుకుపోయిన నైరాశ్యం, కేడర్‌లో అసహనం, ఆశావహుల నిష్టూరాల్లాంటి వాటన్నిటికీ తెరపడబోతోంది. కొత్త అధ్యక్షుడు ఎవరన్న విషయంలో.... రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంలో కేంద్ర పెద్దలు కూడా ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడే ఓ కొత్త చర్చ మొదలైంది రాష్ట్ర పార్టీ వర్గాల్లో.. ఢిల్లీ పెద్దోళ్లు…
BJP New President: జనవరి నాటికి బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రాల్లోనూ అధ్యక్షులు మారనున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల కసరత్తును ప్రారంభించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో జాతీయ అధ్యక్షుడితో పాటు కొన్ని రాష్ట్రాల అధ్యక్షుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ పార్టీ తీర్మానం చేసింది.
BJP New President: భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం ముగిసిపోవడంతో పార్టీ తదుపరి అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగిస్తారో అనే విషయం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. జులై నెలలో తదుపరి అధ్యక్షుడు బాధ్యతలు చేపడతారని సంబంధిత వర్గాలు తెలిపినప్పటికి.. తాజాగా ఆగస్టు నెల చివరి నాటికి కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీలో సంస్థాగత స్థాయి మార్పుల ప్రక్రియ ప్రారంభం కానుంది. కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు జేపీ నడ్డా ప్రభుత్వంలో చేరిన తర్వాత.. పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వస్తారనే విషయం మరింత స్పష్టమైంది. అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం జనవరిలో పూర్తి కావడంతో లోక్‌సభ ఎన్నికల వరకు పొడిగించారు.