జమ్మూకశ్మీర్‌లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వహించనున్నారు. కాగా.. బీజేపీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్‌లలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుండి బిజెపి యువ నేతల్లో ఒకరైన తేజస్వి సూర్యని తప్పించింది. అయితే, బీజేపీ బుధవారం విడుదల చేసిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు లేదు.
Munugode : తెలంగాణాలో ప్రస్తుతం ఏ నోట విన్నా మునుగోడు ముచ్చట్లే.. ప్రధానంగా బరిలో ఉన్న మూడు పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కావాల్సిన శక్తినంతా కూడగట్టుకుంటున్నాయి.