Akhilesh Yadav: మసీదులో అఖిలేష్ యాదవ్ మీటింగ్, డింపుల్ యాదవ్ దుస్తులపై వివాదం..
- మసీదులో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మీటింగ్..
- డింపుల్ యాదవ్ దుస్తులపై వివాదం..
- ప్రార్థనా స్థలాన్ని రాజకీయాలకు వాడటంపై బీజేపీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: ఓ మసీదులో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్‌లు సందర్శించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ ఇద్దరు నేతలపై విరుచుకుపడుతోంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇటీవల పార్లమెంట్ సమీపంలోని ఒక మసీదును సంరద్శించారు. మతపరమైన ప్రాంతంలో రాజకీయా సమావేశాలు నిర్వహించడం ఏమిటని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఈ సమావేశంలో డింపుల్ యాదవ్ ధరించిన దుస్తులపై కూడా వివాదం చెలరేగింది.
Read Also: Australia: F*** Off, ఇండియన్.. ఆస్ట్రేలియాలో వ్యక్తిపై జాతివివక్ష దాడి..
Also Read
- West Bengal Cabinet Expansion 2026: పశ్చిమ బెంగాల్ లో మంత్రివర్గ విస్తరణ.. నబన్నాలో 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
- Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
- DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
- JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అఖిలేష్ యాదవ్ ప్రార్థనా స్థలాన్ని అనధికారికి ఎస్పీ కార్యాలయంగా మార్చారని దుయ్యబట్టారు. “అఖిలేష్ యాదవ్ నిన్న మసీదుకు వెళ్ళాడు. ఆ మసీదు పార్లమెంట్ భవనం ముందు ఉంది. ఎస్పీ ఎంపీ నద్వీ అక్కడి ఇమామ్. మసీదు లోపల రాజకీయ సమావేశం ఎందుకు జరిగింది?” అని ప్రశ్నించారు. ఫోటోలో డింపుల్ యాదవ్ బ్లౌజ్ ధరించినట్లు కనిపిస్తోందని, ఆమె వీపు, పొట్ట కనిపిస్తోందని, డింపుల్ తలపై దుపట్టా కూడా లేదని అన్నారు. ఇది మసీదు లోపల ప్రవర్తనా నియమావళికి పూర్తిగా విరుద్ధమని, ప్రపంచవ్యాప్తంగా ఇది ఇస్లామిక్ మనోభావాలను దెబ్బతీస్తుందని అన్నారు. వీరిపై కేసు నమోదు చేశామని చెప్పారు. మసీదును ఎస్పీ నాయకులు సరదాలకు, ఉల్లాసానికి వేదిక మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ సమావేశంలో దేశవ్యతిరేక కార్యకలాపాల గురించి చర్చించారని అన్నారు.
యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైన ప్రదేశాలను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. అయిత, బీజేపీ ఆరోపణల్ని ఎస్పీ తీవ్రంగా ఖండించింది. ఈ వివాదం ద్వారా జాతీయ సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. బీజేపీ రాజకీయ లాభం కోసం మతాన్ని ఆయుధంగా ఉపయోగిస్తోందని అఖిలేష్ ఆరోపించారు. డింపుల్ యాదవ్ తన తలపై దుప్పట్టా కప్పుకున్నారు, ఫోటో తీస్తున్న సమయంలో జార వచ్చు అని ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్ అన్నారు.
తాజావార్తలు
-
West Bengal Cabinet Expansion 2026: పశ్చిమ బెంగాల్ లో మంత్రివర్గ విస్తరణ.. నబన్నాలో 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
-
Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
-
IRUMUDI : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
-
IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! ‘క్లబ్‌లోకి స్వాగతం’ అంటూ..
-
Vaibhav Sooryavanshi: చెప్పట్లేదు కానీ చాలా ఒత్తిడి ఉంది.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!