Under 1Lakh Bike : లక్ష రూపాయల లోపు ఉత్తమ 125సీసీ బైక్‌లలో బజాజ్ పల్సర్ N125, హీరో ఎక్స్‌ట్రీమ్ 125R మధ్య పోటీ పెరుగుతోంది. ఈ రెండు బైక్‌లు అధునాతన ఫీచర్లతో మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి, వీటిలో ఏది ఎక్కువ ఫీచర్లను అందిస్తోంది? ఏది మైలేజ్ పరంగా మెరుగ్గా ఉంటుంది ? పూర్తి వివరాలు తెలుసుకుందాం. లక్ష రూపాయల కంటే తక్కువ ధర ఉన్న ఈ రెండు బైక్‌లలో చాలా గొప్ప ఫీచర్లను పొందుతున్నారు. బజాజ్, హీరో బైక్‌లు రెండూ 125 సిసి విభాగంలో బాగా పాపులారిటీ సాధించాయి. బజాజ్ పల్సర్ N125, హీరో ఎక్స్‌ట్రీమ్ 125R లలో ఏ బైక్ తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లను అందిస్తోంది.
బజాజ్ పల్సర్ N125, హీరో ఎక్స్‌ట్రీమ్ 125R
బజాజ్ పల్సర్ N125, హీరో ఎక్స్‌ట్రీమ్ 125R బ్లూటూత్ కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే డిజిటల్ LCD స్క్రీన్‌లను పొందుతాయి. రెండూ కాల్, SMS, నోటిఫికేషన్ అలర్ట్ లతో వస్తాయి. ఇది కాకుండా, టర్నింగ్ నావిగేషన్ సపోర్టు కూడా అందుబాటులో ఉంది. కానీ రెండు బైక్‌లలో భిన్నమైన విషయం ఏమిటంటే.. హీరో ఎక్స్‌ట్రీమ్ 125R లో మీరు USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ను పొందుతారు. కానీ బజాజ్ పల్సర్ N125 లో మీకు ఈ సౌకర్యం లభించదు.
Read Also: Nagachaitanya: నెటిజన్ ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగ చైతన్య..?
ఏ ఇంజిన్ ఎక్కువ పవర్ ఫుల్ ?
బజాజ్ పల్సర్‌లో 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ లభిస్తుంది. ఇది 124.58cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్‌తో వస్తుంది. ఇది 8500rpm వద్ద 11.83bhp పవర్, 6000rpm వద్ద 11Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ బైక్‌తో పోలిస్తే హీరో బైక్‌లో 124.7cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ లభిస్తుంది. ఇది 8250rpm వద్ద 11.4bhp పవర్, 6500rpm వద్ద 10.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. హీరో ఈ బైక్ 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఆఫ్షన్ తో వస్తుంది. బజాజ్ పల్సర్ ఇంజిన్ హీరో ఎక్స్‌ట్రీమ్ కంటే కొంచెం పవర్ ఫుల్ గా ఉంటుంది. . కానీ హీరో కంపెనీ ఈ బైక్ కేవలం 6 సెకన్లలోనే 0 నుండి 60 వరకు వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది.
ధరలో చాలా తేడా
బజాజ్ పల్సర్ N125 ధర గురించి మాట్లాడుకుంటే.. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 94,707 నుండి రూ. 98,707 వరకు ఉంటుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ ధర గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ రూ. 95 వేల నుండి రూ. 99,500 వరకు ఉంటుంది.
Read Also:Baijayant Panda: కొత్త సీఎం ఎంపికపై బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ కీలక ప్రకటన..