Siddaramaiah: ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకాలే కారణం.. సీఎం వ్యాఖ్యల్ని ఖండించిన బయోకాన్ చీఫ్
- ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకాలే కారణం
- కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపణలు
- ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని ఖండించిన బయోకాన్ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఈ మధ్య హఠాత్తు మరణాలు సంభవిస్తున్నాయి. దీనికి కోవిడ్ వ్యాక్సినే కారణమంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. యువకులే ఎక్కువగా గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. దీంతో ప్రచారం మరింత వ్యాప్తి చెందుతోంది. అంతేకాకుండా కర్ణాటకలోని హసన్ జిల్లాలో గత నెలలో గుండెపోటుతో 20 మంది చనిపోయారు. దీనికి కోవిడ్ వ్యాక్సిన్లే కారణమంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Drones in War: యుద్ధరంగంలో సరికొత్త శకం.. కీలకంగా వ్యవహరిస్తున్న డ్రోన్లు..
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
తాజాగా బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుదార్ షా స్పందించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. హసన్ జిల్లాలో జరిగిన మరణాలు కోవిడ్ టీకాల ప్రభావం కాదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తెలిపారు. ప్రజల్లోకి చాలా తప్పుడు సమాచారం వెళ్లిందని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ భద్రత, సమర్థవంతంగా ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించినట్లు క్లారిటీ ఇచ్చారు. ఏదో అత్యవసరంగా తొందరపడి టీకాలు రూపొందించలేదని తేల్చి చెప్పారు. లక్షలాది మంది ప్రాణాలను టీకాలు కాపాడాయని గుర్తుచేశారు. అయితే హార్ట్ ఎటాక్‌తో చనిపోతుంటే.. చాలా మంది వ్యాక్సిన్లు కారణంగానే చనిపోతున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Shubman Gill: రెండో టెస్టులోనే.. ‘కింగ్’ కోహ్లీ రికార్డు సమం! గిల్ సూపరో సూపర్
జూన్ నెలలో హసన్ జిల్లాలో 20 మంది గుండెపోటుతో మరణించారు. అయితే ఈ చావులకు కారణమేంటో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. పది రోజుల్లో నివేదిక సమర్పించాలని సిద్ధరామయ్య ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సిన్లను ప్రజలకు తొందరపాటుగా ఆమోదించడం, పంపిణీ చేయడం కూడా మరణాలకు కారణం కావొచ్చని సిద్ధరామయ్య అనుమానం వ్యక్తంచేశారు. వ్యాక్సిన్లతో గుండెపోటు పెరుగుదలకు కారణమవుతాయని వెల్లడించాయన్నారు. దీనిపై కూడా సమగ్ర అధ్యయనం చేయాలని కమిటీని ఆదేశించినట్లు తెలిపారు.
ఇక ఆకస్మిక మరణాలకు ఆరోగ్య సమస్యలే కారణం తప్ప, కోవిడ్ వ్యాక్సిన్ కాదని బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కూడా స్పష్టంచేసింది. ఐసీఎంఆర్, ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన అధ్యయనాల్లో ఈ విషయం తేలిందని పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితంగా, సమర్థంగా పనిచేస్తున్నాయని, తీవ్ర దుష్పరిణామాలు సంభవించిన ఉదంతాలు అత్యంత అరుదుగా కనిపించాయని వెల్లడించాయి.
COVID-19 vaccines developed in India were approved under the Emergency Use Authorisation framework, following rigorous protocols aligned with global standards for safety and efficacy. To suggest that these vaccines were ‘hastily’ approved is factually incorrect and contributes to… https://t.co/uMEcMXzBV0
— Kiran Mazumdar-Shaw (@kiranshaw) July 3, 2025
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!