సిమెంట్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైల్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో వంతెన పైనుంచి బోగీలు కిందపడిపోయాయి. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. పట్టాలు తప్పిన అనంతరం రైలు ఇంజిన్ సుమారు 400 మీటర్లు ముందుకు వెళ్లి ఆగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్‌లో రైలు ప్రమాదం జరిగింది. సిములతాలా వంతెనపై సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో వంతెనపై నుంచి కిందకు మొత్తం 19 బోగీలు పడిపోయాయి. టెల్వాబజార్ హాల్ట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసన్సోల్ నుంచి సీతామఢీకి వెళ్తున్న గూడ్స్ రైలు ఈ ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పిన అనంతరం రైలు ఇంజిన్ సుమారు 400 మీటర్లు ముందుకు వెళ్లి ఆగింది. ప్రమాద సమయంలో లోకో పైలట్ మరియు గార్డు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
In Jammui , Bihar #trainaccident
बिहार के जमुई में बड़ा रेल हादसा! 🚂 झाझा-किऊल सेक्शन पर मालगाड़ी के 17 डिब्बे पटरी से उतरे, जिनमें से 3 नदियां में गिरे। 🌊 मुख्य रेल मार्ग बाधित, 30+ ट्रेनें डायवर्ट। यात्री सावधान रहें! ⚠️ #TrainAccident #Bihar #IndianRailways pic.twitter.com/xHNeu23F23— Divyanshu Kunal (@imD12kunal) December 28, 2025