పెళ్లికి ముందు ఎలా ఉన్నా పర్వాలేదు. పెళ్లితరువాత బరువు బాధ్యతలు తప్పకుండా పెరుగుతాయి. వద్దు అనుకున్నా మోయాల్సి వస్తుంది. పెళ్లి తరువాత ఓ యువకుడు తన భార్యను భుజాన మోసుకుంటూ తీసుకెళ్లాడు. దీనికి కారణం లేకపోలేదు. పెళ్లిచేసుకొని ఇంటికి తీసుకొచ్చే క్రమంలో నదిని దాటాల్సి వచ్చింది. అయితే, భారీ వర్షాలు కురవడంతో నదిలో ఇసుక మేటలు వేసింది. దీంతో కొత్త జంట ప్రయాణం చేస్తున్న పడవ మధ్యలోనే ఆగిపోయింది.
Read: డైలీ సీరియల్ కి 21 ఏళ్లు! ఏక్తా కపూర్ భావోద్వేగం…
అక్కడి నుంచి ముందుకు కదలకపోవడంతో భార్యను భుజాన ఎత్తుకొని నదిని దాటించాడు వరుడు. ఈ సంఘటన బీహార్లోని కిషన్ గంజ్లో జరిగింది. కన్కాయ్ నదిలో తరచుగా వరదలు వస్తుంటాయి. ఈ వరదల కారణంగా తరచుగా ఇలా పడవలు మధ్యలోనే ఆగిపోతుంటాయి. ఈ నదిలోని సింధిగ్మారి వద్ద బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ చాలాకాలంగా ఉందని, కానీ, ఇప్పటి వరకు ఈ నదిపై బ్రిడ్జిని నిర్మించలేదని వరుడి తరపు బంధువులు చెబుతున్నారు.