Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
- బెంగళూరులో దారుణం
- బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం
- ఏడాదిన్నర క్రితమే మృతి చెందినట్లు అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని హవనూర్ లేఅవుట్లో ఓ ఇంటి బాత్రూమ్లో 50 ఏళ్ల మహిళ అస్థిపంజరం కనిపించింది. ఆమె దాదాపు ఏడాదిన్నర క్రితమే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా జీవిస్తున్న ఆమె మరణించిన విషయం ఇంతకాలం బయటకు రాకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మృతురాలిని దాక్షాయిణిగా పోలీసులు గుర్తించారు. ఉత్తర బెంగళూరులోని బాగలగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 7న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఒంటరిగానే జీవనం..
పోలీసుల వివరాల ప్రకారం.. దాక్షాయిణి కొన్నేళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నారు. ఆమె భర్త ఉమేశ్ సుమారు పదేళ్ల క్రితమే మృతి చెందారు. కుమారుడు కూడా అనారోగ్యంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు రెండేళ్లుగా ఆమె కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలు లేవని వెల్లడించారు. ఆగస్టు 7న రాత్రి సుమారు 8 గంటల సమయంలో దాక్షాయిణి ఇంటి తలుపు తెరిచి ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఇంట్లో దొంగతనం జరిగి ఉండొచ్చని అనుమానించిన వారు వెంటనే అత్యవసర నంబర్ 112కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇంటిని పరిశీలించగా.. బాత్రూమ్లో అస్థిపంజర అవశేషాలు కనిపించాయి.
Also Read
- Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
సోదరుడికి సమాచారం..
ఈ ఘటనపై పోలీసులు దాక్షాయిణి సోదరుడు మహేశ్ బసప్పకు సమాచారం అందించారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని అస్థిపంజర అవశేషాలు తన సోదరివేనని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. తన సోదరి మరణంపై ఎలాంటి అనుమానం లేదని, ఆమె మృతికి మరెవరూ కారణమై ఉండొచ్చని తాను భావించడం లేదని మహేశ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
పోలీసుల విచారణలో మహేశ్ పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. 2005లో కుమారుడు మరణించిన తర్వాత దాక్షాయిణికి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు, శివమొగ్గలోని ఆస్పత్రుల్లో ఆమెకు చికిత్స అందించారని, వైద్యులు స్కిజోఫ్రెనియాగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. అలాగే ఆమె సుమారు నాలుగు నెలల పాటు ఓ పునరావాస కేంద్రంలో కూడా చికిత్స పొందినట్లు పోలీసులు వెల్లడించారు.
దాక్షాయిణి మృతదేహం పూర్తిగా అస్థిపంజరంగా మారిపోయిన నేపథ్యంలో ఆమె మరణానికి కచ్చితమైన కారణం, సమయం తెలుసుకునేందుకు పోలీసులు అవశేషాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)కు పంపించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 194 కింద అసహజ మరణ నివేదిక నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ పరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే ఆమె ఎప్పుడు, ఎలా మృతి చెందారనే విషయంపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.
- Tags
- Bengaluru
- Crime News
- Woman
తాజావార్తలు
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!