Bengaluru Schools Bomb Threat: బెంగళూరులోని 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు స్థానికంగా కలకలం సృష్టించింది. బాంబు పేలుడు జరుపుతామని శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్స్ పంపారు. దీంతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. దీంతో సంబంధిత పాఠశాలలను పోలీసులు ఖాళీ చేయించారు. అన్నింటిలో మొదటిది, ఏడు పాఠశాలల్లో బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి.
కాగా.. బసవేశ్వర్ నగర్‌లోని నేపెల్, విద్యాశిల్ప పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసానికి ఎదురుగా ఉన్న పాఠశాలకు కూడా బెదిరింపులు వచ్చాయి. కాగా.. మరికాసేపటికి మరో ఏడు పాఠశాలలకు కూడా అలాంటి మెయిల్స్ రావడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో.. బాంబు బెదిరింపులు బూటకమని సంకేతాలు ఉన్నప్పటికీ.. బాంబు డిస్పోసల్ స్క్వాడ్‌లు ఆ ప్రాంగణంలో క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. ఏ పాఠశాలలోనూ బాంబులు ఉన్నట్లు వారు ఇంకా ధృవీకరించలేదు.
#WATCH | Karnataka Deputy CM DK Shivakumar visits a school in Bengaluru after several schools received threatening e-mails. pic.twitter.com/7y3ReGOtAt
— ANI (@ANI) December 1, 2023
Hamas: హమాస్‌ను అంతం చేస్తా.. మాట మార్చుడు లేదు.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు