Bengaluru mall: ధోతీ కట్టిన రైతు పవర్.. బెంగళూర్ మాల్ మూసివేత..
- ధోలీ కట్టిన రైతుకి మాల్లో ప్రవేశం నిరాకరణ..
- సోషల్ మీడియాలో జీటీ మాల్ తీరుపై తీవ్ర ఆగ్రహం..
- మాల్‌పై కేసు.. వారం పాటు మూసివేత..
Bengaluru mall: ధోతీ ధరించిన రైతుని మాల్కి నిరాకరించిన బెంగళూర్ ఘటన యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ధోతీ ధరించాడని చెబుతూ రైతుని, అతని కొడుకుని సినిమా టిక్కెట్లు ఉన్నప్పటికీ జీటీ మాల్‌లోకి అనుమతించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చివరకు మాల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. ఇదిలా ఉంటే రైతు సంఘాల నుంచి నిరసనలు రావడం, ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో అధికారులు మాల్‌పై చర్యలకు ఉపక్రమించారు.
రైతుకు ఎంట్రీ నిరాకరించిన మాల్ యజమాని, సెక్యూరిటీ గార్డుపై కేసు నమోదైంది. పోలీసులు చర్యలు తీసుకోకుండా ఆందోళకు దిగుతామని రైతు నాయకులు హెచ్చరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి, తాత్కాలికంగా మాల్ని మూసేశారు. వారం రోజుల పాటు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. జీటి మాల్ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకిత్తించిన తర్వాత, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేష్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Also Read
- Supreme Court: ప్రవక్త కాలం నుంచే మసీదుల్లోకి మహిళలకు అనుమతి ఉంది.. జస్టిస్ అమానుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ తిరస్కరణ
- Amit shah: ‘‘దీదీ ఇంటికెళ్తున్నారు’’.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న అమిత్ షా
- Bengal Election: బెంగాల్లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం!
Read Also: UTTAR PRADESH: రాజకీయ దుమారంగా మారిన “కన్వర్ యాత్ర” రూల్స్.. ‘‘యాంటీ ముస్లిం’’ అంటూ విమర్శలు..
అసలేం జరిగింది..?
కర్ణాటక హవేరీ జిల్లాకు చెందిన ఫకీరప్ప అనే రైతు తన కొడుకును చూసేందుకు బెంగళూర్ వచ్చారు. అయితే, తన తండ్రిని సినిమాకు తీసుకెళ్లేందుకు కొడుకు టిక్కెట్లు బుక్ చేసుకుని, జీటీ మాల్లోని థియేటర్‌కి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ధోతీ ధరించిన కారణంగా మాల్లో తండ్రికొడుకుల్ని అనుమతించలేదు. తమ వద్ద టికెట్లు ఉన్నాయని చెప్పినప్పటికీ నిర్వాహకులు ససేమిరా అన్నారు. లోపలికి వెళ్లాలంటే ప్యాంట్ వేసుకోవాలని రైతుకు సూచించారు. దీని సంబంధించిన వీడియో వైరల్ అయింది.
బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో, ధోతి ధరించినందుకు రైతులను దుర్భాషలాడుతున్నారు, అవమానిస్తున్నారు? మాల్‌లోకి ప్రవేశం నిషేధించబడింది! కర్నాటక సీఎం ధోతీ ధరిస్తారు! ధోతీ మాకు గర్వకారణం.. మాల్లో రైతు టక్సీడో ధరించాలా?’’ అంటూ ట్వీట్ చేశారు. డీజిల్ ధరలను పెంచి రైతులకు ద్రోహం చేశారు. ఇప్పుడు ధోతీ ధరించిన రైతుని అవమానించారు. రాహుల్ బాబా ఎక్కడ..? అని ప్రశ్నించారు. ఇదేనా కిసాన్ కే సాథ్ న్యాయ్..? అంటూ అడిగారు.
తాజావార్తలు
-
Supreme Court: ప్రవక్త కాలం నుంచే మసీదుల్లోకి మహిళలకు అనుమతి ఉంది.. జస్టిస్ అమానుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
PEDDI : ‘పెద్ది’ జూన్ నెలాఖరున రిలీజ్ ఫిక్స్..
-
Dr Preeti Reddy: బీజేపీ ఆఫీస్‌కు మల్లారెడ్డి కోడలు.. రాజకీయాల్లో హాట్ టాపిక్!!
-
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ తిరస్కరణ
ట్రెండింగ్
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!