Murshidabad riots: గత నెలలో వక్ఫ్ అల్లర్ల పేరుతో బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో మతకలహాలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో ముగ్గురు చనిపోయారు. ఆందోళనకారులు పలు వాహనాలకు, ఇళ్లకు నిప్పుపెట్టారు. ముస్లిం మెజారిటీ కలిగిన ముర్షిదాబాద్ ప్రాంతంలో, హిందువుల ఆస్తులపై దాడులు జరిగాయి. ఈ అల్లర్ల వల్ల వందలాది హిందూ కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అల్లర్లపై బెంగాల్ ప్రభుత్వం, మమతా బెనర్జీలు సరైన చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది.