Jio Recharge: భారతదేశంలో ప్రముఖంగా కొనసాగుతున్న రిలయన్స్ జియో (Reliance Jio) దేశంలోని మొబైల్ నెట్‌వర్క్ విభాగంలో తక్కువ కాలంలో తన ప్రభావాన్ని విస్తరించింది. 2016లో ప్రారంభమైన ఈ కంపెనీ మొదట ఉచిత ప్లాన్స్, తక్కువ ధరల డేటా ప్లాన్లు, ఉచిత వాయిస్ కాల్స్‌తో భారీ స్థాయిలో వినియోగదారులను ఆకర్షించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 46 కోట్ల మంది మొబైల్ యూజర్లను కలిగి ఉండగా.. జియో నెట్‌వర్క్ ప్రపంచంలోని పలు దేశాల్లోనూ తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత కలిగిన సేవలందించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ఇటీవల కాలంలో రిలయన్స్ జియో కస్టమర్ గ్రోత్‌లో కాస్త వెనుకబడినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. కంపెనీ టారిఫ్‌లను పెంచడమే. టారిఫ్‌లు పెరిగిన నేపథ్యంలో చాలామంది వినియోగదారులు ప్రత్యామ్నాయంగా బీఎస్ఎన్ఎల్ వంటి నెట్‌వర్క్‌లవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం సేవలు పొందాలనుకునే యూజర్లను ఆకర్షించేందుకు జియో తాజాగా రూ.895 లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ను ప్రకటించింది.
Read Also: Viral Video: వీరి యాక్టింగ్ ముందు చాలామంది హీరోహీరోయిన్స్ కూడా పనికిరారుగా..?!
అయితే, ఇది ప్రత్యేకంగా జియో భారత్ మొబైల్ యూజర్ల కోసం రూపొందించబడింది. ఇక ఈ రూ.895 ప్లాన్ వివరాలను చూసినట్లయితే.. ఈ ప్లాన్ మొత్తం 336 రోజులు (సుమారు 11 నెలలు) వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అనిమిత కాల్స్ లభిస్తాయి. ఇక నెలకు 2GB హైస్పీడ్ ఇంటర్నెట్, మొత్తంగా 24GB డేటా అందించబడుతోంది. అలాగే రోజుకు 50 ఉచిత ఎస్ఎంఎస్‌లు ఇవ్వబడుతాయి. ఈ ప్లాన్ ముఖ్యంగా బేసిక్ మొబైల్ యూజర్లను టార్గెట్ చేసి తీసుకొచ్చినదిగా చెబుతున్నారు. తక్కువ ధరలో, ఎక్కువ కాలం సేవలు అందాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన పోటీదారులకు జియో గట్టిపోటీ ఇవ్వాలని చూస్తోంది. కాగా, ఈ కొత్త ప్లాన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రం అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. మౌలిక మొబైల్ వినియోగదారుల కోసం మాత్రమే ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. మొత్తంగా, తక్కువ డేటా అవసరమున్న ఎక్కువ కాలం వ్యాలిడిటీ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ అనుకూలంగా నిలవనుంది.