Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్‌తో ఉత్కంఠ..
- బెంగాల్లో ఈసారి గెలుపు బీజేపీదేనా..?
- నాలుగు ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి, రెండు టీఎంసీకి..
- హోరాహోరీ పోరు తప్పదంటున్న సర్వేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal exit polls: 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలకు ఎన్నికలు ముగిశాయి. ఈ రోజు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అస్సాంలో బీజేసీ, తమిళనాడులో డీఎంకే కూటమి, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి విజయం సాధిస్తుందని పలు ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. అయితే, దేశంలో ఎక్కువ ఆసక్తి ఉన్న పశ్చిమ బెంగాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
బెంగాల్లో బీజేపీ వైపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు మొగ్గు చూపాయి. ఈసారి బెంగాల్లో కాషాయ జెండా ఎగురుతుందని చెప్పాయి. ఇదే సమయం ఒకటి రెండు ఎగ్జిట్ పోల్స్ మాత్రం మరోసారి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. 4 ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారం సాధిస్తుందని చెబుతుంటే, రెండు మాత్రం టీఎంసీ వైపు వెళ్లాయి. మొత్తంగా హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. 2021 బెంగాల్ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఆ సమయంలో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ ఉంటుందని అంచనా వేయగా, టీఎంసీ 2015 సీట్లతో ఘన విజయం సాధించగా, బీజేపీ 77 సీట్లతో సరిపెట్టుకుంది.
Also Read
Read Also: Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
ప్రస్తుతం అంచనాలను చూస్తే.. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు గానూ బీజేపీకి 146-161 సీట్లు సాధిస్తుందని, టీఎంసీ 125-140 సీట్లకే పరిమితమవుతుందని మ్యాట్రిజ్ అంచనా వేసింది. పీమార్క్ ప్రకారం.. బీజేపీకి 150-175 సీట్లు వస్తాయని, టీఎంసీ 118-138 సీట్ల దక్కించుకుంటుందని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్ బెంగాల్లో బీజేపీకి 150-160 స్థానాలు గెలుస్తుందని, టీఎంసీ 130-140 సీట్లు వస్తాయని చెప్పింది. పోల్ డైరీ బీజేపీకి 142-171 స్థానాలతో ఆధిక్యంలో ఉంటుందని, టీఎంసీ 99-127 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది.
ఇదిలా ఉంటే పీపుల్స్ పల్స్ టీఎంసీకి 177-187 సీట్లు వస్తాయని అంచనా వేయగా, జన్మత్ పోల్స్ 195-205 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జేవీసీ హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేసింది. బీజేపీకి 138-159 సీట్లు, టీఎంసీకి 131-152 సీట్లు వస్తాయని పేర్కొంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!