Madhya Pradesh: బీజేపీకి ఓటేసినందుకు ముస్లిం మహిళపై దాడి.. బాధితురాలిని కలిసిన సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 230 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ఏకంగా 163 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 66 సీట్లు మాత్రమే పరిమితమైంది. గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతోంది. మొత్తం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కైవసం చేసుకోగా.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందింది.
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసినందుకు ముస్లిం మహిళను కుటుంబసభ్యులే చితకబాదారు. బాధిత మహిళను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన నివాసంలో కలిశారు. సమీనా బీ, ఆమె ఇద్దరు పిల్లల్ని, సీఎం చౌహాన్ పరామర్శించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసినందుకు, బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చినందుకు ఆమె కుటుంబం ఆమెను కొట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సీఎం ఆమెను కలవాలని నిర్ణయించుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Also Read
- Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
- Independence Day 2026: మౌల్వీ మహమ్మద్ బాఖిర్... బ్రిటిష్ని గడగడలాడించిన జర్నలిస్ట్!
- August 14, 1947 అర్ధ రాత్రి ఏం జరిగింది?.. స్వాతంత్య్ర సంబరాల వెనుక దాగిన విభజన విషాదం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
Read Also: Indian Workers : ఏయే దేశాలలో భారతీయులు ఎక్కువగా పని చేస్తున్నారో తెలుసా?
ఆమె భద్రతపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. నా పిల్లలపై శ్రద్ధ చూపినందుకు మరోసారి కూడా బీజేపీకే తాను ఓటేస్తానని సీఎం చౌహాన్‌తో చెప్పినట్లు సమీనా బీ వెల్లడించారు. ‘‘నేను బీజేపీకి ఓటేశానని తెలుసుకున్న నా బావ జావేద్ నాపై దాడి చేశాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ పార్టీకి ఓటు ఎందుకు వేశావని అతను ప్రశ్నించాడు’’ అని మహిళ చెప్పింది. చౌహాన్ భయ్యా ఎప్పుడూ తప్పు చేయలేదని అందుకే తాను బీజేపీకి ఓటేసినని చెప్పారు. నాలుగు సార్లు ఎంపీ సీఎంగా పనిచేసిన చౌహాన్ తాను ప్రస్తుతం సీఎం రేసులో లేనని, తాను పార్టీ సేవకుడినని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 29 లోక్‌సభ స్థానాలు సాధించడమే బీజేపీ లక్ష్యమని, అందుకోసం పనిచేస్తానని చెప్పారు.
తాజావార్తలు
-
Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
-
Mega 158 : చిరు – బాబీ సినిమాకు ‘కదిరి కాకాజీ’ టైటిల్ ఫిక్స్ చేసారా?
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
JCB Hydrogen Car: బుల్డోజర్ల తయారీ సంస్థ JCB వరల్డ్ రికార్డు.. హైడ్రోజన్ కారుతో గంటకు 653.90KM స్పీడ్!
-
Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్‌లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
ట్రెండింగ్
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!