Kolkata Knight Riders Won By 81 Runs Against Royal Challengers Bangalore: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో.. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాజయం చవిచూసింది. కేకేఆర్ 205 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. ఆర్సీబీ 123 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో కేకేఆర్ 81 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కేకేఆర్ స్పిన్నర్ల మాయాజాలం ముందు.. ఆర్సీబీ బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. ఏ ఒక్కరూ కూడా నిలకడగా రాణించలేకపోయారు. కెప్టెన్ డు ప్లెసిస్ 23 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడంటే.. ఆర్సీబీ బ్యాటర్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా.. ఇలా క్రీజులోకి వచ్చి, అలా పెవిలియన్ బాట పట్టడమే తప్ప ఎవ్వరూ ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడలేదు.
Janhvi Kapoor: ఎన్టీఆర్ హీరోయిన్ క్లివేజ్ షో.. ఆ కర్వ్ ఏదైతే ఉందో

తొలుత టాస్ గెలిచి ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. కేకేఆర్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. గుర్బాజ్ (57), శార్దూల్ ఠాకూర్ (68), రింకు సింగ్ (46) అద్భుతంగా రాణించడం వల్లే.. కేకేఆర్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఒక దశలో కేకేఆర్ 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో.. 150 పరుగులైనా చేస్తుందా? లేదా? అనే అనుమానాలు రేకెత్తాయి. అప్పుడు మైదానంలో అడుగుపెట్టిన శార్దూల్.. ఒకటే పరుగుల వర్షం కురిపించాడు. ఎడాపెడా షాట్లతో చెలరేగిపోయాడు. రింకుతో కలిసి ఆరో వికెట్‌కి 103 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. అతని ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ వల్లే కేకేఆర్ 200 పరుగుల మార్క్‌ని దాటేసి, 204 స్కోర్ చేయగలిగింది.
KKR vs RCB: పీకల్లోతు కష్టాల్లో ఆర్సీబీ.. 10 ఓవర్లలో ఇదీ పరిస్థితి!
ఇక 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. మొదట్లో శుభారంభమే చేసింది. విరాట్ కోహ్లీ (21), డు ప్లెసిస్ (23) కలిపి.. 4 ఓవర్లలోనే 42 పరుగుల పార్ట్‌నర్‌షిప్ జోడించారు. ఇది చూసి.. ఛేజింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని, ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని అనుకున్నారు. కానీ.. ఎప్పుడైతే స్పిన్నర్స్ వచ్చారో, అప్పటినుంచి ఆర్సీబీ పతనం మొదలైంది. కోహ్లీ, డు ప్లెసిస్ ఔటయ్యాక.. ఇతర బ్యాటర్లు కూడా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఏ ఒక్కరూ కూడా కనీస పోరాట పటిమని కనబర్చలేకపోయారు. క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. దీంతో.. ఆర్సీబీ 123 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ 4 వికెట్లు తీయగా.. సుయాశ్ 3, సునీల్ నరైన్ 2, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు.