Bareilly violence: “ఐ లవ్ ముహమ్మద్” అల్లర్లకు ముందుగానే ప్లాన్..
- యూపీ బరేలీ అల్లర్లలో కుట్ర కోణం..
- ఐలవ్ ముహమ్మద్ వివాదంలో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bareilly violence: ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఇటీవల ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం నెలకొంది. సెప్టెంబర్ 26న బరేలీలో దీనిపై ఆకస్మికంగా గుమిగూడిన ప్రజలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లకు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఇత్తెహాద్ ఎ మిల్లత్ కౌన్సిల్(IMC) చీఫ్ తౌకీర్ రజాను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి సన్నిహితులు, అనుచరులపై యోగి సర్కార్ బుల్డోజర్ యాక్షన్ ప్రారంభించింది.
Read Also: TG SET-2025 : తెలంగాణ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల
Also Read
అయితే, అల్లర్లకు ముందు రోజే పథకం ప్రకారం అశాంతిని సృష్టించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి ఐఎంసీ శాంతియుత నిరసనకు పిలుపునిచ్చినప్పటికీ, పార్టీ క్యాడర్ నుంచి మాత్రం వచ్చిన సందేశం అశాంతి దారి తీసినట్లు తెలుస్తోంది. ముందుగా ఇత్తెహాద్-ఏ-మిల్లత్ కౌన్సిల్ (IMC) సెప్టెంబరు 25న ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో సెప్టెంబరు 26న ఇస్లామియా ఇంటర్ కాలేజ్‌లో ఏ కార్యక్రమానికీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, అందువల్ల ప్రజలు మసీదుల్లో ప్రార్థనలు ముగించిన వెంటనే ఇంటికి వెళ్లిపోవాలంటూ స్పష్టం చేశారు. దీనిని గమనించిన పోలీసులు శాంతియుత పిలుపుగా భావించి పెద్దగా భద్రతా ఆందోళనల్ని వ్యక్తం చేయలేదు.
అయితే, ఆదివారం తెల్లవారుజాము తౌకీర్ రజా అనుచరుడు, ఐఎంసీ మెంబర్ నదీమ్ ఖాన్ అదే లేఖను వాట్సాప్ గ్రూప్ లో పంపాడు. అయితే, ఈ లేఖ ఫేక్ అని, కౌన్సిల్ పేరు దెబ్బతీయాలని చూస్తున్నారని చెబుతూ ప్రజల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించాడు. ఇదే మొత్తం అల్లర్లకు ముఖ్య కారణమని పోలసీులు భావిస్తున్నారు. ఈ మెసేజ్ కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున గుంపులుగా సమావేశమయ్యారు. అదే రోజు అల్లర్లు జరిగాయి. దీనికి ముందు సెప్టెంబర్ 21న తౌకీర్ రాజ ఓ వీడియోను విడుదల చేస్తూ.. వెళ్లి ప్రదర్శన చేయండి, అవసరమైతే హింసకు వెనకాడొద్దని పిలుపునిచ్చినట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది. పోలీసులపై ఆయుధాలు, పెట్రోల్ బాంబులు విసిరారు. అనేక మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఇప్పటి వరకు ఈ అల్లర్లపై 11 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 80 మందిని అరెస్ట్ చేశారు. 2000 మందికి పైగా నిందితులు ఉన్నారు. అల్లర్లకు పాల్పడిన వారి ఆస్తుల్ని యోగి సర్కార్ సీజ్ చేస్తోంది.
తాజావార్తలు
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!