బాలీవుడ్ సంగీత దిగ్గజం, ప్రముఖ గాయకుడు బప్పి లహిరి కన్నుమూసిన విషయం తెలిసిందే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు బప్పి లహిరి.. ఆయన వయస్సు 69 సంవత్సరాలు.. 1952 నవంబర్ 27న బెంగాల్‌లో జన్మించిన బప్పి లహిరి.. సంగీతంలో తన విభిన్న శైలితో చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులతో కూడా ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది.. బప్పి మరణ వార్త విని ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు, సంగీత ప్రియులు విషాదంలో మునిగిపోయారు.. అయితే, బప్పి లహిరి మృతికి అసలు కారణం ఏంటి? అనే చర్చ సాగుతోంది.. పలు శారీరక రుగ్మతలతో బాధపడుతున్న ఆయన మృతికి అసలు కారణం అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) అనే రుగ్మతగా వైద్యులు తేల్చేశారు.. ఇక, అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే ఏంటి..? దాని లక్షణాలు ఏంటి..? అది ఎలా వస్తుంది..? దానిని గుర్తించడం ఎలా? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది..
అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) అంటే ఏంటి?:
అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే ఏంటి? అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. కొందరు మనుషులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడతారు.. అకస్మాత్తుగా లేచి గాలి తీసుకుంటారు.. దీనినే స్లీప్ అప్నియా అని కూడా పిలుస్తారు. ఇది సర్వసాధారణమే అయినప్పటికీ, పలు సందర్భాల్లో మనిషి రక్తపోటును పెంచి, గుండె ఆగిపోయే పరిస్థితులు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నమాట.. దీని తీవ్రతను భట్టి ఈ స్లీప్ అప్నియాను.. అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, సెంట్రల్ స్లీప్ అప్నియా, కాంప్లెక్స్ స్లీప్ అప్నియా అని మూడు రకాలుగా పేర్కొంటున్నారు వైద్యులు.. ఇక, వీటిలో అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా మనుషుల్లో శ్వాశ సంబంధమైన రుగ్మతలకు దారితీస్తుందని చెబుతున్నారు.. గురక చాలా సాధారణం.. ఇది అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) అనే పరిస్థితికి దారితీస్తే సమస్యగా మారుతుందంటున్నారు వైద్యులు.. OSA అనేది చాలా సంవత్సరాలుగా గుర్తించబడని ఒక తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి. OSA ఉన్న వ్యక్తులు నిద్రలో జారుకున్న తర్వాత బిగ్గరగా గురక పెడతారు. ఇక, శ్వాత తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది.. వివిధ శరీర అవయవాలకు ఆక్సిజన్ సరఫరాపై ప్రభావాన్ని చూపుతుంది.. ఇది అప్నియాకి దారితీస్తుంది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల వారు అలసట, పగటిపూట నిద్రపోవడం, చిరాకు మరియు ఏకాగ్రత లేకపోవడం వంటి అనేక రకాల న్యూరోసైకియాట్రిక్ లక్షణాలతో బాధపతారని వైద్యులు చెబుతున్నారు..
అంతేకాదు.. విడాకులు మరియు రోడ్డు ప్రమాదాలకు కూడా ఇది ప్రధాన కారణంగా చెబుతున్నారు.. మానసిక మరియు శారీరక ఆరోగ్య సమస్యలు హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు), షుగర్ (మధుమేహం), గుండె సరైన పద్ధతిలో కొట్టుకోకపోవడం, గుండెపోటు, ఆకస్మిక గుండె మరణం, పక్షవాతం, డిప్రెషన్ లాంటి అనేకి సమస్యలకు దారి తీస్తుందని సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ సంతోష్ బంగర్ వెల్లడించారు.. ఇది సాధారణంగా ఊబకాయం ఉన్న వ్యక్తులను, ముఖ్యంగా పొట్టి మెడ, పెద్ద నాలుక మరియు దవడ అసాధారణంగా ఉన్న పురుషులకు ఇబ్బందులు తెచ్చి పెడుతుంది.. అంతేకాదు.. సన్నగా ఉన్న వ్యక్తుల్లో కూడా కనిపిస్తుంది. వంశపారంపర్యంగా కూడా సోకుతుంది.. స్లీపింగ్ టాబ్లెట్ తీసుకునే వ్యక్తులు, అధిక మొత్తంలో ఆల్కహాల్ లేదా ధూమపానం తాగడం వల్ల ఇది మరింత తీవ్రమవుతుందంటున్నారు
అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా లక్షణాలు ఏంటి..?
అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా చికిత్స ఏంటి..?
మనుషుల ప్రాణాలకే ముప్పుగా మారే ఈ అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA)కు చికిత్స కూడా ఉందని చెబుతున్నారు డాక్టర్లు, పరిశోధకులు.. ఈ రుగ్మతను ముందే గుర్తించగలిగితే వెంటనే వైద్యులను కలిస్తే.. దీని నుంచి బయటపడే అవకాశం లేకపోలేదు అంటున్నారు.. పరిస్థితి తీవ్రంగా ఉంటే.. కొన్ని చికిత్స పద్ధతులు ఉన్నాయని చెబుతున్నారు హార్వర్డ్ పరిశోధకులు.. అయితే, అత్యంత సాధారణ చికిత్సలలో ఒకటిగా CPAPని ప్రయోగిస్తారని చెబుతున్నారు వైద్యులు.. CPAP అనేది అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్న వ్యక్తి యొక్క ముక్కు మరియు నోటికి పెట్టె ఒక పైపు లాంటి పరికరం. ఇది రాత్రిపూట నిద్రించే సమయంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా చేస్తుంది.. CPAPకి మరో ప్రత్యామ్నాయం నోటికి సరిపోయే ఒక ప్లాస్టిక్ ఇన్సర్ట్ వాడతారు.. అది నోటిలో పెట్టుకోవడంతో నాలుకకు, శ్వాస మార్గాలకు మధ్య ఉన్న కణజాలాలు మూసుకుపోకుండా నిరోధిస్తుందని పేర్కొన్నారు..