Site icon NTV Telugu

Bangladesh: బంగ్లా విద్యార్థి నేతలు ఇక మారరా.. బీఎన్పీ విజయానికి భారత్ కారణమట..

Bangladesh (1)

Bangladesh (1)

Bangladesh: ఎన్నికల్లో అవామీలీగ్ అరాచకాలక పాల్పడిందని బంగ్లాదేశ్ విద్యార్థి నేతలు ఆరోపించి, షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చేలా చేశారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్‌ను తాత్కాలిక దేశాధినేతగా చేశారు. ఈయన హయాంలో నిర్వహించిన ఎన్నికల్లో ఇటీవల బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్ బంగ్లాదేశ్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు బంగ్లాదేశ్ విద్యార్థి నేతల ఏడుపు బీఎన్పీపై పడింది.

Read Also: Kristalina Georgieva: ఏఐ ఎఫెక్ట్.. 40% ఉద్యోగాల హాంఫట్..? భారత్‌కు ఇది కీలక పరీక్ష!

షేక్ హసీనాను గద్దె దించడంలో కీలకంగా వ్యవహరించిన విద్యార్థి నేత నాహిద్ ఇస్లాం సంచలన ఆరోపణలు చేశారు. నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) కన్వీనర్, ప్రతిపక్ష పార్టీ విప్ అయిన నాహిద్ ఇస్లాం మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు బీఎన్పీ భారత్‌తో చేయి కలిపిందని ఆరోపించారు. 2026 ఎన్నికల్లో భారత్, అవామీలీగ్‌తో సంధి చేసుకుని బీఎన్పీ విజయం సాధించిందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు సందేహాస్పదంగా ఉన్నాయని, స్వతంత్ర, నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మళ్లీ అవామీలీగ్‌ను బలపరిచే ప్రయత్నం చేస్తే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారని అన్నారు. దేశ ప్రజలు ఎలాంటి రాజకీయ పునర్వాసం ప్రయత్నాలను అంగీకరించడని, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే దీనిని అడ్డుకుంటామని హెచ్చరించారు. అవామీ లీగ్‌పై చర్చలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైతే దీనికి పూర్తి బాధ్యత కొత్త ప్రభుత్వానిదే అని అన్నారు. అవామీ లీగ్‌ను మళ్లీ బతికించేందుకు ప్రయత్నిస్తే రాజకీయ పోరాటానికి సిద్ధమని చెప్పారు. దేశంలో మళ్లీ అవామీ లీగ్ ఆఫీసుల్ని తెరుస్తున్నారని, ఇది రాజకీయ వ్యూహం కావచ్చని నాహిద్ వ్యాఖ్యానించారు.

Exit mobile version