Suvendu Adhikari: బీజేపీ నేత సువేందు అధికారిపై దాడికి బంగ్లాదేశ్ టెర్రరిస్టు గ్రూపుల కుట్ర..
- బీజేపీ నేత సువేందు అధికారిపై బంగ్లా టెర్రర్ గ్రూపుల కుట్ర..
- దాడికి పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరిక..
- భద్రతను పెంచాలని ఐబీ అధికారుల సూచన..
- బంగ్లాదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న అధికారి..
- హిందువుల అణిచివేతకు వ్యతిరేకంగా గళం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suvendu Adhikari: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న బీజేపీ నేత, బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారిపై దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌కి చెందిన ఒక ఇస్లామిక్ మతఛాందసవాద బృందం దాడికి పాల్పడేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ సోర్సెస్ ప్రకారం.. బంగ్లాదేశ్‌కి చెందిన ఒక గ్రూపుతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల సువేందు నివాసం ఉండే తూర్పు మేదినీపూర్‌లోని కాంటాయ్‌లో రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
దుండగులు గత వారం ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు, పరిసరాల గురించి సర్వే చేసినట్లు, సువేందు అధికారి నివాసాన్ని ఫోటోలు తీసినట్లు అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ప్రకారం..తక్షణ చర్యలు తీసుకోవాలని ఐబీ అధికారులు కోల్‌కతా పోలీసులను, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. ఆయన నివాసం చుట్టూ భద్రత పెంచాలని అధికారులకు ఆదేశాలు అందాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి Z+ సెక్యూరిటీ ఉన్న ఆయనకు మరింత సెక్యూరిటీ పెంచాలని ఆదేశాలు వచ్చాయి. పండుగ సీజన్‌లో ప్రమాదం ఎక్కువగా ఉన్నందున రాష్ట్ర మరియు స్థానిక పోలీసు బలగాలతో పాటు CISF కూడా తమ నిఘా ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఐబీ సూచించింది.
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
Read Also: Arvind Kejriwal: బీజేపీ సీఎం అభ్యర్థి పర్వేష్ వర్మ.. ఇలాంటి వ్యక్తి ఢిల్లీ సీఎం కావాలా..?
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వంలో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు పెరిగాయి. ఈ దాడుల్ని సువేందు అధికారి తీవ్రంగా ఖండించారు. హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టుపై ఆయన గళం విప్పారు. బంగ్లా మధ్యంతర ప్రభుత్వాన్ని మిలిటెంట్లతో పోల్చారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ చట్టబద్ధమైన ప్రధాని అని, ఆమెని తొలగించాల్సి వస్తే అది ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారానే జరగాలని ఆయన సూచించారు. యూనస్ ప్రభుత్వం చట్టవిరుద్ధమని చెప్పారు.
అయితే, ఈ ఉగ్రవాద ముప్పుపై అధికారి మాట్లాడుతూ.. తనకు ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లడం లేదని, ప్రజలే తనను కాపాడుతారని సువేందు అధికారి బుధవారం చెప్పారు. గతంలో సీపీఎం, టీఎంసీలు నాపై దాడి చేశాయని, ఇప్పుడు ఉగ్రవాదులు దాడి చేయాలని చూస్తున్నారని, అయితే ఇంతకుముందు తనను కాపాడిన ప్రజలే మళ్లీ కాపాడుతారని అన్నారు.
తాజావార్తలు
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!