Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bangladesh Envoy Summoned After Threat To Isolate Seven Sisters Security Threat To India Mission

India-Bangladesh: “భారత ఈశాన్య రాష్ట్రాలను వేరుచేస్తాం”.. బంగ్లా రాయబారికి సమన్లు జారీ..

Published Date :December 17, 2025 , 3:53 pm
By Venu Goapl Reddy
  • ‘‘సెవెన్ సిస్టర్స్’’ను ఒంటరి చేస్తాం..
  • ఈశాన్య రాష్ట్రాలకు బంగ్లాదేశ్ నేతల బెదిరింపులు..
  • బంగ్లా హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసిన భారత్..
India-Bangladesh: “భారత ఈశాన్య రాష్ట్రాలను వేరుచేస్తాం”.. బంగ్లా రాయబారికి సమన్లు జారీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

India-Bangladesh: బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఢాకాలోని భారత హైకమిషన్‌కు భద్రతా బెదిరింపులు చేశారు. అయితే, ఈ పరిణామాలపై భారత్ బంగ్లాదేశ్ హైకమిషన్‌ ఎం రియాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. ఢాకాలోని భారత మిషన్‌పై దాడులు చేస్తామంటూ అక్కడ కొంతమంది తీవ్రవాద శక్తులు వ్యాఖ్యానించడంపై భారత విదేశాంగశాఖ సమన్లు జారీ చేసినట్లు తెలిపింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ సంఘటనలకు సంబంధించి సరైన ఆధారాలు పంచుకోకపోవడం, చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని చెప్పింది.

యాదృచ్ఛికంగా, బంగ్లాదేశ్ నాయకుడు ఈశాన్య రాష్ట్రాలను ప్రస్తావిస్తూ.. సెవన్ సిస్టర్స్‌ను ఒంటరి చేస్తామని బెదిరించిన ఒక రోజు తర్వాత హైకమిషనర్ ఎం రియాజ్ హమీదుల్లాను భారత విదేశాంగశాఖ పిలిపించింది. గతేడాది షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్ ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేకతను కొన్ని మతఛాందస సంస్థలు పెంచి పోషిస్తున్నాయి. భారత్‌ను బెదిరించేలా అక్కడి నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారు.

Read Also: Imran Khan: “మా తండ్రిని ఇక చూడలేమేమో”.. ఇమ్రాన్ ఖాన్ కుమారుల సంచలన వ్యాఖ్యలు..

‘‘బంగ్లాదేశ్‌ను అస్థిరపరిస్తే, ప్రతిఘటన అగ్ని సరిహద్దులు దాటి వ్యాపిస్తుంది. మీరు మమ్మల్ని అస్థిరపరిచే వారికి ఆశ్రయం ఇస్తున్నందున, మేము సెవెన్ సిస్టర్స్ వేర్పాటువాదులకు కూడా ఆశ్రయం ఇస్తాము’’అని సోమవారం ఒక ర్యాలీలో భారతదేశం యొక్క తీవ్ర విమర్శకుడైన నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) నాయకుడు హస్నత్ అబ్దుల్లా హెచ్చరించారు.

ఇదిలా ఉంటే, భారత వ్యతిరేకి, షేక్ హసీనాను గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాదిపై ఢాకాలో హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో భారత్, అవామీలీగ్ పాత్ర ఉందని అక్కడి భారత వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన తర్వాత బంగ్లాదేశ్ ఢాకాలోని భారత హైకమిషనర్‌ను పిలిపించింది. ఈ హత్యాయత్నం కేసులో సహకరించాలని చెబుతూనే, హసీనాను అప్పగించాలని డిమాండ్ చేసింది. అయితే, ఈ దాడిలో భారత ప్రమేయంపై వస్తున్న ఆరోపణల్ని భారతదేశం తీవ్రంగా తిరస్కరించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anti-India Rhetoric
  • Bangladesh Extremism
  • Bangladesh politics
  • Hasnat Abdullah
  • India-Bangladesh Relations

తాజావార్తలు

  • MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..

  • Off The Record: ఆ జిల్లాలో టీడీపీ వర్సెస్‌ జనసేన..? ఆ పార్టీ నేతల్ని లైట్‌ తీసుకుంటున్నారా..?

  • Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…

  • Tilak Varma: అరుదైన రికార్డ్ సాధించిన తిలక్ వర్మ.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్..

  • CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే

ట్రెండింగ్‌

  • Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!

  • Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!

  • ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్‌, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!

  • 8.18mm స్లిమ్‌, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions