India-Bangladesh: ఉగ్రవాదుల బెదిరింపులు, బంగ్లాదేశ్ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పెరుగుతున్న భద్రతా సమస్యల మధ్య భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం బంగ్లా రాజధాని ఢాకాలో ఉన్న ఇండియన్ వీసా దరఖాస్తు కేంద్రాన్ని (IVAC) మూసివేసింది. భద్రతా పరిస్థితిని చూసిస్తూ మధ్యాహ్నం 2 గంటల నుంచి కార్యకలాపాలను నిలిపేసింది.
India-Bangladesh: బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఢాకాలోని భారత హైకమిషన్‌కు భద్రతా బెదిరింపులు చేశారు. అయితే, ఈ పరిణామాలపై భారత్ బంగ్లాదేశ్ హైకమిషన్ ఎం రియాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. ఢాకాలోని భారత మిషన్‌పై దాడులు చేస్తామంటూ అక్కడ కొంతమంది తీవ్రవాద శక్తులు వ్యాఖ్యానించడంపై భారత విదేశాంగశాఖ సమన్లు జారీ చేసినట్లు తెలిపింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ సంఘటనలకు సంబంధించి సరైన ఆధారాలు పంచుకోకపోవడం, చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని చెప్పింది. యాదృచ్ఛికంగా, బంగ్లాదేశ్…