Eknath Shinde: ఉద్ధవ్ ఠాక్రే మమ్మల్ని ‘‘ఇంటి పనివారి’’గా చూశాడు.. ఇదే శివసేన చీలికకు కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: శివసేన పార్టీలో చీలిక తీసుకురావడంపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. బాలా సాహెబ్ థాకరే( ఉద్ధవ్ ఠాక్రే తండ్రి) మమ్మల్ని స్నేహితులుగా భావించేవారు, కానీ ఉద్ధవ్ ఠాక్రే మాత్రం మమ్మల్ని ‘‘ఇంటి పనివారి’’గా భావించేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లోని రామ్‌టెక్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేనకు సైద్ధాంతిక మిత్రపక్షాలు కాని కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ..‘‘ పార్టీ సిద్ధాంతంతో రాజీపడినందుకు నేను విడిపోయాను’’ అని అన్నారు.
Read Also: Allahabad High Court: హిందూ వివాహానికి ఏడడుగులు తప్పనిసరి.. ‘కన్యాదానం’ అవసరం లేదు.. హైకోర్టు తీర్పు
Also Read
- Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- India S-400 Squadron: భారత్‌కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
- Vivek Agarwal's Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ-శివసేన మెజారిటీ సీట్లను దక్కించుకుంది. అయితే, గెలుపు తర్వాత సీఎం సీటుపై ఉద్ధవ్ ఠాక్రే పేచీ పెట్టడం, దానికి బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఆయన ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో ఈ ప్రభుత్వం పడిపోవడం, ఆ తర్వాత షిండే, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎన్సీపీలో చీలిక వర్షం అజిత్ పవార్ కూడా బీజేపీ-శివసేన(షిండే)తో ప్రభుత్వంలో చేరారు.
ఇదిలా ఉంటే, ఆదివారం నాగ్‌పూర్‌లో జరిగిన సమావేశంలో షిండే మాట్లాడుతూ.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకి ఓటు వేయాలని కోరారు. మళ్లీ ప్రధానిగా నరేంద్రమోడీని మూడోసారి అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. అధికార కూటమిలో సీట్ల పంపిణీ మరో రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని అన్నారు. మహారాష్ట్రలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
-
Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్‌ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!