Bajrang Dal Activist Killed in Assam: అస్సాం కరీంగంజ్ లో హిందూ సంస్థ భజరంగ్ ధళ్ కార్యకర్త హత్య ఉద్రిక్తతలను పెంచుతోంది. 16 ఏళ్ల భజరంగ్ దళ్ కార్యకర్తను అనిముల్ హక్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కరీంగంజ్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో లోవైర్ పోవాలో శుంభు కోయిరి అనే యువకుడిని అనిముల్ హక్ కొత్తితో పొడిచి చంపాడు. నిందితుడు అనిముల్ హక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
Read Also: Jalebi Baba : దెబ్బకి దెయ్యం వదిలిందిగా.. 120మందిపై అత్యాచారం
ఇదిలా ఉంటే ఈ హత్యపై ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో జిల్లాలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. స్థానికుల భారీ నిరసనలతో నలుగురి కన్నా ఎక్కువ వ్యక్తులు గమిగూడకుండా ఆదేశాలు జారీ చేశారు. పొరుగున ఉన్న హైలాకండి జిల్లాలో మూడు రోజుల పాటు జరిగిన భజరంత్ ధళ్ శిక్షణా శిబిరం నుంచి తిరిగి వస్తుండగా.. అనిముల్ హక్, శంభుకోయిరిని కత్తితో పొడిచి చంపేశాడు. గతంలో కూడా వీరిద్దరి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే కర్ణాటకలో హిందు సంస్థల కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శివమొగ్గకు చెందిన భజరంగ్ దళ్ కార్యకర్తపై హత్యాయత్నం జరిగింది. సోమవారం కొడవలితో సునీల్ ను చంపేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన శివమొగ్గలోని సాగర పట్టణంలో జరిగింది. సునీల్ పై దాడి చేసిన వ్యక్తిని సమీర్ గా గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు మూడు టీములను ఏర్పాటు చేశారు.