వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వారికంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నటులు చాలామంది ఉన్నారు. కానీ అందరికీ లక్ కలిసి రాదు. కొంత మంది ఎంత పెద్ద ఫ్యామి బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన వారికంటూ ఒక ఫేమ్ సంపాదించుకోవడం కష్టం. అలాంటి వారిలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న భారీ హిట్ మాత్రం అందుకోలేదు. తెలుగులో ‘లైగర్’ మూవీ తో వచ్చిన అమ్మడు ఇక్కడ కూడా నిరాశే ఎదురుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య తన కెరీర్‌కి సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకుంది.
Also Read : Surya : నిజంగా జైలులో ఉన్నట్లు అనిపించింది
‘వారసత్వంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాకు మొదట్లో పలు సవాళ్లు తప్పలేదు.కెరీర్ ప్రారంభంలో సెట్స్ లో ఏది చెప్తే అది చేసేదాన్ని. అంతే తప్ప.. మన అవసరాలు, సమస్యల గురించి నిర్మొహమాటంగా, ధైర్యంగా చెప్పాలి అనే విషయం నాకు తెలియదు. అలా ఉంటేనే మనకంటూ అండగా నిలబడే వ్యక్తులు ఉన్నారన్న విషయం నాకు ‘గెహ్రియాన్’ సినిమా సెట్ లోనే అర్థమైంది. ఆ సినిమాలో నా సహ నటి దీపికా పదుకొణె నటించింది. ఆమె సెట్‌ల్లో ప్రతి ఒక్కరికీ అండగా నిలబడేది. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించేది. అందరితోనూ మర్యాదపూర్వకంగా వ్యవహరించేది. ఆమె స్టార్ హోదాలో ఉంది అయినా కూడా తనలో కొంచెం కూడా గర్వం కనిపించదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న జీవిత సూత్రం ఆమె నుంచే నేర్చుకున్నా. ఇంకా చెప్పాలి అంటే దీపిక వల్లే నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది’ అని చెబుతోంది అనన్య.