Crime News: కన్నతల్లిని చంపి ఐదు ముక్కలు చేసిన కూతురు.. రెండు నెలలుగా ఇంట్లోనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: రోజురోజుకు సమాజంలో మనిషి మైండ్ ఎలా మారుతుందో చెప్పడం చాలా కష్టంగా మారుతోంది. ఎప్పుడు ఎవరు..ఎలా చంపేస్తారో అని భయం మొదలయ్యింది. వివాహేతర సంబంధాల వలన భార్యాభర్తలు.. డబ్బు కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకరిని ఒకరు చంపుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. పెళ్లి చేసుకోమందని ప్రియురాలిని నరికి ముక్కలు ముక్కలు చేశాడు ఒకడు.. కూర సరిగ్గా వండలేదని భార్యను, ప్రేమించిన అమ్మాయి తో చనువుగా ఉన్నాడని స్నేహితుడిని ముక్కలు చేసాడు ఇంకొకడు.ఇలా మనిషి ప్రాణానికి విలువే లేకుండా చేస్తున్నారు కొంతమంది. తాజాగా కన్నతల్లిని చంపి ముక్కలు ముక్కలు చేసి రెండు నెలలుగా ఇంట్లోనే ఉంచుకుంది ఒక కూతురు. ఈ దారుణ ఘటన ముంబైలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని లాల్‌బాగ్ చాల్ లో వీణా ప్రకాష్ జైన్ ఆమె కుమార్తె రింపుల్ నివసిస్తున్నారు.ఇక డిసెంబర్ 27 న వీణా మెట్లపై నుంచి జారీ కిందపడిపోయింది. దీంతో ఆమెకు బలమైన దెబ్బలు తగిలాయి.రింపుల్, తల్లిని హాస్పిటల్ కూడా తీసుకువెళ్లకుండా ఇంట్లోనే ఉంచేసింది. దీంతో ఆమె తల్లి రెండు రోజుల్లోనే మృతిచెందింది. ఇక తల్లి మరణంతో రింపుల్ మెంటల్ స్టేటస్ మారిపోయింది. ఎక్కడ తన తల్లిని చంపింది తానే అని అందరు తనను జైలుకు పంపిస్తారేమో అని భయపడింది. వెంటనే బయటికి వెళ్లి మార్బుల్ కట్టర్ కొని.. తల్లి మృతదేహాన్ని ఐదు ముక్కలుగా కోసింది. ఆ కట్టర్ పనిచేయకపోవడంతో కత్తితో శరీర భాగాలను కట్ చేసి బ్యాగ్ లో చుట్టి ఇంట్లోనే దాచేసింది. ఇక శరీరం స్మెల్ రాకుండా తీ ఆకులు, రూమ్ ఫ్రెషనర్ బాటిల్స్ 40 కొని ఇల్లంతా ఆస్మెల్ వచ్చేలా చేసింది. అలా రెండు నెలలు తల్లి శరీర భాగాలతో ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. అనంతరం ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫోన్ చేయడంతో గుట్టు బయటపడింది. తల్లి మరణం తనమీదకు వస్తుందనే భయంతోనే తాను ఇలా చేసినట్లు రింపుల్ అంగీకరిస్తూ వాంగ్మూలం ఇచ్చింది. ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచిన పోలీసులు మరింత విచారణ చేపట్టారు.
Also Read
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
తాజావార్తలు
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!