Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరానికి ఓ మహిళ భక్తురాలు ఇచ్చిన రూ.4 కోట్ల భారీ విరాళం చెక్ బౌన్స్ మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంత పెద్ద మొత్తానికి చెక్ ఇచ్చిన ఆమె బ్యాంకు ఖాతాలో మాత్రం కేవలం రూ.3 మాత్రమే ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో అసలు ఆమె ఎందుకు ఇంత భారీ మొత్తానికి చెక్ ఇచ్చారు? ఆ చెక్ బౌన్స్ కావడంతో ఇప్పుడు ఏం జరగబోతోంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
చెన్నైకి చెందిన ఓ మహిళా భక్తురాలు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రూ.4 కోట్ల చెక్ ఇచ్చారు. అయితే ఈ డబ్బును ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది సౌకర్యాలు, సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేయాలని కూడా కోరారు. అంతేకాదు ఈ మొత్తాన్ని అదే అవసరాలకు ఉపయోగిస్తామని ట్రస్ట్ నుంచి లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కూడా ఆమె షరతు పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
అయితే ట్రస్ట్ నిబంధనల ప్రకారం ఒక దాత సూచించిన నిర్దిష్ట ప్రయోజనం కోసమే డబ్బును ఖర్చు చేస్తామని ప్రత్యేకంగా హామీ ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు ఆమెకు వివరించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమె ఇచ్చిన రూ.4 కోట్ల చెక్కును ట్రస్ట్ బ్యాంకులో జమ చేసింది. చెక్ క్లియర్ చేసే ప్రక్రియలో ఖాతాను పరిశీలించిన బ్యాంకు అధికారులు అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు.
ఆ చెక్కుకు సంబంధించిన ఖాతాలో కేవలం రూ.3 మాత్రమే ఉన్నట్లు తేలింది. డబ్బు లేకపోవడంతో చెక్ కూడా బౌన్స్ అయింది. దీంతో ఖాతాలో నిధులు లేకపోయినా ఇంత భారీ మొత్తానికి చెక్ ఎందుకు ఇచ్చారనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. ఈ విషయంపై మహిళకు నోటీసు ఇచ్చి వివరణ కోరేందుకు బ్యాంకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అయితే ఆమె ఆలయానికి పూర్తిగా విరాళం ఇవ్వలేదని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే రూ.4 కోట్ల చెక్‌తో పాటు మరో రూ.10 వేల మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని ఆలయానికి అందజేసి రసీదు కూడా తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రూ.4 కోట్ల చెక్కు సంబంధించిన వ్యవహారాన్ని ట్రస్ట్ ఆమెతో చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అయోధ్య రామ మందిరానికి వచ్చే విరాళాల పరిమాణం కూడా భారీగానే ఉంది. ప్రతి నెలా ఆలయానికి సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు విరాళాలు వస్తున్నట్లు సమాచారం. ఇందులో చెక్కుల రూపంలోనే నెలకు దాదాపు రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు విరాళాలు అందుతున్నాయి.
రామ మందిర నిర్మాణం కోసం 2020లో నిర్వహించిన నిధి సమర్పణ అభియాన్ సమయంలో కూడా భారీ మొత్తంలో విరాళాలు సేకరించారు. దేశవ్యాప్తంగా 45 రోజుల పాటు సాగిన ఆ కార్యక్రమంలో దాదాపు రూ.3,500 కోట్లు సమీకరించినట్లు సమాచారం. ఆ సమయంలో కూడా కొన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయి. తర్వాత వాటిలో చాలా మొత్తాన్ని రికవరీ చేసినప్పటికీ, సుమారు రూ.22 కోట్ల వరకు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ తాజా ఘటనకు మరింత ప్రాధాన్యం రావడానికి మరో కారణం కూడా ఉంది. కొద్ది నెలల క్రితమే రామ మందిరం విరాళాల నిర్వహణకు సంబంధించి దుర్వినియోగం ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు రూ.4 కోట్ల చెక్ బౌన్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆలయానికి వస్తున్న విరాళాలను ఎలా నిర్వహిస్తున్నారు, వాటి లెక్కలు ఎలా పర్యవేక్షిస్తున్నారు అనే అంశాలపై మరోసారి చర్చ మొదలైంది.
అయితే ఈ వ్యవహారంపై రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చెక్ ఎందుకు జారీ చేశారు, దాని వెనుక మహిళ ఉద్దేశం ఏమిటి, ఈ వ్యవహారం చివరకు ఎలా పరిష్కారమవుతుంది అనేది అధికారిక వివరణ వచ్చిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంలో మాత్రం రూ.4 కోట్ల చెక్కు ఖాతాలో కేవలం రూ.3 ఉండటమే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశంగా మారింది.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!