Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sardar 2: తమిళ స్టార్ హీరో కార్తీ డ్యూయల్ రోల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ‘సర్దార్ 2’. ఇందులో ఎస్.జె. సూర్య మెయిన్ విలన్‌గా నటిస్తుండగా, మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తోంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, తెలుగు నటి అషు రెడ్డి కీలక పాత్రలు పోషిస్తుండగా, సామ్ సి.ఎస్. దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. దసరా కానుకగా 2026 సెప్టెంబర్ 10న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ గురించి మేకర్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చేసింది. ‘సర్దార్ 2’ ట్రైలర్ ను ఈరోజు రాత్రి 8:15 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ట్రైలర్లో కార్తి ఎలాంటి యాక్షన్‌తో కనిపించబోతున్నారనే ఆతృత అభిమానుల్లో మొదలైంది.
‘సర్దార్’ మొదటి భాగం దీపావళి కానుకగా 2022 అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలవ్వగా, దాదాపు ₹40 కోట్ల బడ్జెట్‌తో ₹100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి హిట్ టాక్ సొంతం చేసుకుంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో రాశి ఖన్నా, రజిషా విజయన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఆంధ్రా, తెలంగాణల్లోనూ ₹15 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టింది. పి.ఎస్. మిథ్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్లో కార్తి మరోసారి స్పై ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ‘సర్దార్’ తొలి భాగం మంచి విజయం సాధించడంతో రెండో భాగంపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీని పలు భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. తొలి భాగం ఇచ్చిన సక్సెస్‌ను సీక్వెల్ ఎంతవరకు కొనసాగిస్తుందో, ఇప్పటికే సినిమాపై ఉన్న బజ్కు ట్రైలర్ మరింత ఊపు తీసుకొస్తుందా అనేది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!